మోక్షు కి ట్రీట్మెంటా...?

నందమూరి వారసుడు బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదిగో.. ఇదిగో అంటున్నారు కానీ మోక్షజ్ఞ మాత్రం బయటికి రావడంలేదు. మోక్షజ్ఞ పుట్టినరోజున బాలెయ్యె స్వయంగా మోక్షజ్ఞ వచ్చే ఏడాది అంటే 2019 జూన్ లో సినీ ఎంట్రీ ఇస్తాడని ప్రకటించాడు. అయితే మోక్షజ్ఞ మాత్రం బయట ఎవరికీ కనబడడంలేదు. కొన్నేళ్ల నుండి మోక్షజ్ఞ బయట ఎవరికీ కనబడకుండా తిరుగుతున్నాడు. ఆఖరికి బాలయ్య చిన్న కూతురు పెళ్లిలోను మోక్షిని కనబడకుండా దాచేసారు. అసలు ఆ పెళ్ళికి మోక్షజ్ఞ అటెండ్ కాలేదు.
ఇక ఇప్పుడు హీరో అవడం కోసం మోక్షజ్ఞ విదేశాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని... అందులో భాగంగానే మోక్షజ్ఞ విదేశాల్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడని..... బాడీ ఫిట్ గా వుండడానికి జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో జిమ్ చేస్తున్నాడని ఏవేవో ప్రచారం జరుగుతున్నాయి. మరోపక్క మోక్షజ్ఞ అన్ని విధాలా ఫిట్ గా ఉండడానికి గాని ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని గుసగుసలు కూడా వినబడుతున్నాయి. మరి ఈలెక్కన మోక్షజ్ఞ అందరి ముందుకు ఎంతో పర్ఫెక్ట్ గా... హీరోకుండాల్సిన అన్ని లక్షణాలతో బయటికి వస్తాడన్నమాట.
నటనలో, డాన్స్ ల్లో.. శిక్షణ మాత్రమే కాకుండా ఇలా బాడీ ఫిట్ నెస్ విషయంలో కూడా మోక్షజ్ఞ ఎంతో శ్రద్ద వహిస్తున్నాడని... బాలకృష్ణ కూడా ఏంతో పకడ్బందీగా తన వారసుణ్ణి సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు.

