మొన్నటిదాకా సైలెంట్... ఇప్పుడు

ఓం కార్ డైరెక్షన్ లో వస్తున్న 'రాజుగారి గది 2 ' టైటిల్ లోగోని నిన్న శుక్రవారం వినాయకచవితి శుభాకాంక్షలతో విడుదల చేశారు. ఓం కార్ డైరెక్షన్ లో వస్తున్న రెండో సినిమా 'రాజుగారి గది 2 ' లో స్టార్ నటులు నటిస్తున్నారు. సీనియర్ హీరో నాగార్జున సైక్రటిస్ట్ కేరెక్టర్ చేస్తుండగా.... మరో టాప్ హీరోయిన్ సమంత కూడా ఈ చిత్రం లో గెస్ట్ రోల్ చేస్తుంది. ఇక ఇప్పుడు 'రాజుగారి గది 2 ' టైటిల్ లోగో విడుదల చేసిన చిత్ర యూనిట్ త్వరలోనే అంటే నాగార్జున బర్త్ డే కానుకగా 'రాజుగారి గది 2 ' డిజిటల్ మోషన్ పోస్టర్ ని విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
అంతేనా అక్కినేని పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 20 న 'రాజుగారు గది 2 ' ట్రైలర్ ని విడుదల చేస్తారనే టాక్ కూడా నడుస్తుంది. రాజుగారి గది సినిమా చిన్న సినిమాగా విడుదలై ప్రభంజనమే సృష్టించింది. మరి ఓం కార్ తీసిన మొదటి సినిమాలోనే సక్సెస్ అందుకుని ఇప్పుడు పెద్ద నటులతో ఈ 'రాజుగారి గది 2 ' ని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ ని కూడా భారీ లెవల్లో నిర్వహించాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ చిత్రానికి భారీగా హైప్ తీసుకురావడానికి గాను.... సినిమా అక్టోబర్ 13న విడుదలవుతున్న సందర్భంగా , సెప్టెంబర్ 30 న 'రాజుగారి సభ' అనే రేంజ్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు.
మరి ఈ సినిమా గనక హిట్టయితే డైరెక్టర్ ఓం కార్ కి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తుంది. అదే గనక రాజుగారి ఫలితం గనక తారుమారైతే మనోడి భవిష్యత్తుకి ఏం ఢోకా వుండదులే... ఎదుకంటే ఓం కార్ డాక్టర్ డిగ్రీని పూర్తి చేసి మరీ ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.

