మొన్న బాలయ్యకి జరిగిందే ఇప్పుడు చిరుకి జరిగిందా?

నట సింహం నందమూరి బాల కృష్ణ తన 99 వ చిత్రంగా డిక్టేటర్ చిత్రీకరణ దశలో ఉండగా తాను నటించబోయే 100 వ చిత్రం ఏది కావాలా అనే మీమాంసలో చాలా కాలం ఉండిపోయారు. ఆ సమయంలో క్రిష్ కంటే ముందుగా కృష్ణ వంశి బాలయ్య తో సంప్రదింపులు జరిపి 'రైతు' అనే కథని నేరేట్ చేసి ఒప్పించారు. అందులో ఒక కీలకమైన పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ని సంప్రదించగా ఆయన ముందు ఒప్పుకుని తరువాత ఆ పాత్ర చేయటానికి సంశయించి చివరికి నిరాకరించారు. దర్శకుడు కృష్ణ వంశి ఆ పాత్రని కృష్ణం రాజు చేత చూపిద్దాము అని చెప్పినప్పటికీ బచ్చన్ కాకపోతే తనకి ఆ కథే వొద్దు అంటూ తిరస్కరించారు బాలయ్య.
ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ చిత్రం సైరా నరసింహారెడ్డి రెండవ షెడ్యూల్ చిత్రీకరణకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా క్రేజ్ కలిపించి విడుదల చేసే యోచన తో అన్ని భాషలలో ప్రఖ్యాత నటుల్ని ఎంపిక చేసుకున్న సురేందర్ రెడ్డి ఒక కీలక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ని ఒప్పించారు. అయితే ఆయన పాత్ర షూటింగ్ దగ్గర పడుతున్నకొద్దీ బిగ్ బి చేస్తారా లేదా అనే సందిగ్ధం పెరిగిపోతోందట సైరా బృందానికి. ఇప్పటికి కూడా బిగ్ బి ఏ విషయం తేల్చి చెప్పకపోవటమే ఇందుకు కారణం. మరి బాలయ్య ని ఆశపెట్టి ఉసూరుమనిపించిన మాదిరిగానే చిరుని కూడా చేస్తారా బిగ్ బి లేక షూటింగ్ కి హాజరవుతారా అనేది కొద్దీ రోజులలో స్పష్టత వచ్చేస్తుంది.

