Mon Apr 13 2026 15:43:15 GMT+0530 (India Standard Time)
మొదటిరోజు బాగానే కలెక్ట్ చేసింది!!

అల్లు అర్జున్ - పూజ హెగ్డే జంటగా నటించిన 'డీజే దువ్వాడ జగన్నాథం' చిత్రం ఈ శుక్రవారమే విడుదలైంది. దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కావాల్సినంత కామెడీ.... అలాగే యాక్షన్ పార్ట్ కూడా అలరించేదిగా ఉండడంతో ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీసు వద్ద బాగానే కలెక్షన్స్ సాధిందని చెబుతున్నారు. అలాగే పూజ హెగ్డే అందాల ఆరబోత, అల్లు అర్జున్ బ్రాహ్మణ కామెడీ కూడా ఈ చిత్రానికి ప్రధానమైన ప్లస్ పాయింట్స్ గా చెబుతున్నారు. ఇక డీజే చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ మీ కోసం..
ఏరియా ఫస్ట్ డే ఏపీ షేర్
నైజాం 4.95
సీడెడ్ 2.70
నెల్లూరు 1.11
కృష్ణ 1.03
గుంటూరు 2.26
వైజాగ్ 1.95
తూర్పు గోదావరి 1.86
పశ్చిమ గోదావరి 2.08
ఫస్ట్ డే ఏపీ , టీఎస్ షేర్ 17 .94
Next Story

