మొత్తానికి పట్టాలెక్కుతోంది!!

ఈ మధ్యన క్రీడాకారుల జీవితాలను సినిమాలుగా తీసి భారీ హిట్స్ కొడుతున్నారు. ఈ ట్రెండ్ ఎక్కువగా బాలీవుడ్లోనే మొదలుపెట్టారు. వారు ఫేమస్ క్రీడాకారుల బయో పిక్స్ ని తెరకెక్కించి మంచి విజయాలను చవి చూస్తున్నారు. ఇప్పుడు కూడా తాజాగా మన తెలుగు క్రీడాకారులైన సైనా నెహ్వాల్, పి.వి.సింధు, బ్యాట్మెంటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ల బయో పిక్ లు తెరకెక్కిస్తున్నారని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఇక సైనా నెహ్వాల్ బయో పిక్ ని కూడా బాలీవుడ్ వారే నిర్మిస్తూ తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్‌పై చాలా రోజుల నుండి తర్జన భర్జనలు జరుగుతున్నాయి.
చాలా రోజులనుండి పుల్లెల గోపీచంద్ బయో పిక్ పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే వున్నాయి. గోపీచంద్ రోల్లో టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబు కనిపిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్‌పై ఒక క్లారిటీకి వచ్చారంటున్నారు. ఎయిర్‌లిఫ్ట్ ప్రొడ్యూసర్ విక్రమ్ మల్హోత్రా దీన్ని తెలుగు, హిందీలో తెరకెక్కించనున్నాడని చెబుతున్నారు. ఇప్పటికే గోపీచంద్ బయో పిక్ కి సంబంధించిన అన్ని హక్కులు విక్రమ్ మల్హోత్రా సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది. ఇకపోతే ఈ చిత్రంలో నటించే నటీనటులు, ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరు అనే దానిమీద ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.
గోపీచంద్ బయో పిక్ పై స్పందించిన కోచ్ గోపీచంద్ విక్రమ్ మల్హోత్రా ఆలోచన విధానం తనకు నచ్చిందని, కోట్లాది మందికి బ్యాడ్మింటన్ సినిమా ద్వారా మరింత చేరువ అవుతుందని భావిస్తున్నట్లు తెలిపాడు. అందుకే ఈ చిత్రానికి తాను ఒకే చెప్పినట్లు చెప్పాడు. ఇక త్వరలోనే నటీనటుల వివారాలు, డైరెక్టర్ వివరాలు కూడా అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది.

