మొత్తమ్మీద మారుతి మీద బాగా నమ్మకం పెడుతున్నారు!!

మహానుభావుడు సినిమా హిట్ తో మారుతీ దశ తిరిగినట్లుగానే కనబడుతుంది. ఇప్పటికే అక్కినేని కుర్రాడు నాగ చైతన్యతో సినిమా ఫిక్స్ చేసుకుని ఆ స్క్రిప్ట్ మీద కూర్చున్న మారుతి కి గీత ఆర్ట్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. అయితే గీత ఆర్ట్స్ బ్యానర్ లో మారుతి ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ హీరోగా సినిమా తెరకెక్కిస్తారు అననుకున్నారు. కానీ ఇపుడు సాయి ధరమ్ తేజ్ మాత్రం డైరెక్టర్ రవి దర్శకత్వంలో చేసిన జవాన్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూడడంతోపాటే వి వి వినాయక్ సినిమా తో బాగా బిజీగా వున్నాడు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో......
అలాగే రైటర్ ఆకుల శివ మాంచి రెగ్యులర్ కమర్షియల్ స్టోరీని సాయి ధరమ్ తేజ్ కి అందించాడని టాక్. ఇక ఆ సినిమా తరువాతి సినిమా కూడా ఫిక్స్ చేసుకున్నాడు సాయి. మరి దీన్ని బట్టి మారుతీతో సినిమా చెయ్యాలంటే ప్రస్తుతానికి సాయి ఖాళీగా లేకపోవడంతో గీత ఆర్ట్స్ వారు ఈసారి మారుతీ దర్శకత్వంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ కి శ్రీకారం చుడుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఎలాగూ మారుతి - నాగ చైతన్య ల సినిమా వచ్చే డిసెంబర్ నాటికీ గాని పట్టాలెక్కే ఛాన్స్ లేదుకాబట్టి ఈలోపు గీత ఆర్ట్స్ వారికి ఆ సినిమా చేస్తాడా అంటే.. ఉహూ ప్రస్తుతానికి నాగ చైతన్య సినిమా తర్వాతే ఏదైనా అన్నట్టు మారుతి బిహేవియర్ ఉంది. మరి గీత ఆర్ట్స్ వారు మంచి కథ దొరికితే మారుతీతో భారీ సినిమాకి ప్లాన్ సిద్ధం చేసారున్నారు. మరి మారుతి నుండి వస్తున్న హిట్స్ తో గీత ఆర్ట్స్ వారు భారీ సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నారు అంటే... మారుతి మీద ఎంత నమ్మకం పెట్టకపోతే ఇలా చేస్తున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి.
- Tags
- మారుతి

