మే ని కబ్జా చేసారుగా?

మార్చ్ మొదటివారంలో విద్యార్థులంతా తమ తమ పరీక్షల హడావిడిలో మునిగిపోయి సినిమాల ఊసెత్తే సమస్యే లేదు. అందుకే దర్శక నిర్మాతలు తమ సినిమాలను మార్చ్ ఎండ్ నుండి జూన్ ఫస్ట్ వీక్ వరకు విడుదలకు ప్లాన్ చేసి వేసవి సెలవులని క్యాష్ చేసుకుంటారు. మరో రెండు రోజుల్లోనే మార్చ్ నెల స్టార్ట్ కాబోతుంది. మొదటి మూడు వారాల్లోనూ సినిమా లేవి విడుదలకావడంలేదు. కానీ మార్చ్ చివరినుండి భారీ బడ్జెట్ సినిమాల్తో వేసవి సెలవులకి వెలకమ్ చెబుతున్నారు. మార్చ్ చివరిలో మెగా హీరో రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో బోణి చేస్తుండగా.. ఆ తర్వాత ఏప్రిల్ లో నాని కృష్ణార్జున యుద్ధం, మహేష్ భరత్ అనే నేను, రజినీకాంత్ కాలా సినిమాలు సందడి చేయనున్నాయి.
మరి భరత్ అనే నేను నిర్మాతలు, నా పేరు సూర్య నిర్మాతలు రాజి పడడంతో అనుకున్న డేట్ కి మహేష్ ఒక వారం ముందుకి, అల్లు అర్జున్ ఒక వారం వెనక్కి జరిగి సమస్యని పరిష్కరించుకున్నాయి. అల్లు అర్జున్ మే మొదట్లోనే అంటే మే 4 నే తన నా పేరు సూర్యని థియేటర్స్ లోకి దింపుతున్నాడు. ఇక మే మొత్తం అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలే ఆక్రమించినట్లుగా తెలుస్తుంది. ముందుగా అల్లు అర్జున్ నా పేరు సూర్యతో థియేటర్స్ లోకి దిగడం.. మరో రెండు వారాలు మరే ఇతర సినిమా థియేటర్స్ లోకి రాకుండా గీత ఆర్ట్స్ వారు చూసుకోవడంతో వదలకుండా.... మళ్ళీ గీత ఆర్ట్స్ బ్యానర్ లో విజయ్ హీరోగా తెరకెక్కిన ట్యాక్సీ వాలాను మే 18 న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.
అటు వక్కంతం వంశి డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా వస్తున్న నా పేరు సూర్య మీద ఎన్ని అంచనాలున్నాయో... అర్జున్ రెడ్డి తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ దేవరకొండ ట్యాక్సీ వాలా సినిమాపై అంతే అంచనాలున్నాయి. రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 18న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరి ఈ సినిమాకి కూడా గీతవారు మరో రెండు వారలు థియేటర్స్ లోనే ఉంచుతారు. అలా మే మొత్తం నా పేరు సూర్య, ట్యాక్సీ వాలతో గీత ఆర్ట్స్ వారు కబ్జా చేసేస్తారన్నమాట

