మెహర్ కి మెగా హీరో హెల్ప్ చేస్తాడా?

'శక్తి, షాడో' సినిమాల్తో మెహర్ రమేష్ కి ఇండస్ట్రీ లో వరుస ఫ్లాప్స్ కొట్టిన దర్శకుడిగా పేరొచ్చేసింది. అయితే వెంకటేష్ తో చేసిన 'షాడో' సినిమా తరువాత మెహర్ రమేష్ ఏ సినిమా ని ఒప్పుకోలేదు... అనడంకంటే.. అతనికి ఎవరు అవకాశాలు ఇవ్వలేదనడం కరెక్ట్. ఆ మధ్య కాలంలో మెహర్ రమేష్, మహేష్ బాబు, అతని ఫ్యామిలీతో కలిసి తిరిగినా గాని మహేష్ బాబు మాత్రం మెహర్ రమేష్ కి అవకాశం ఇవ్వలేదు. ఇండస్ట్రీలో ఏ ఒక్క ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు మెహర్ రమేష్ కి ఛాన్స్ ఇవ్వడానికి అస్సలు ఇష్టపడట్లేదు.
అయితే ఇప్పుడు మెహర్ రమేష్.. సాయి ధరమ్ తేజ్ కి వల వేసాడని టాక్ వినబడుతుంది. మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో అయిన సాయి ధరం తేజ్, మెహర్ రమేష్ కి ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు అనే టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి. రీసెంట్ గా 'జవాన్' తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సాయి ధరం తేజ్ తన తదుపరి సినిమాల్ని వి.వి.వినాయక్ ఇంకా కరుణాకరణ్ దర్శకత్వం లో చేస్తున్నాడు. ఇకపోతే మెహర్ రమేష్ కూడా ఈ మధ్య సాయి ధరం తేజ్ తో కలిసి తిరుగుతున్నాడు. తాజాగా జరిగిన 'జవాన్' ప్రీమియర్ షో కి కూడా సాయి ధరం తేజ్ తో కలిసి వచ్చాడు మెహర్ రమేష్.
మరి దీన్ని బట్టి చూస్తుంటే సాయి ధరమ్ తేజ్ - మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో వచ్చే మూవీ ఎంతో దగ్గరలో లేదు అని అర్ధం అవుతుంది.

