మెగా హీరోలిద్దరూ ఒకేసారి?

మెగా హీరోలైన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ ని వారణాసి షెడ్యూల్ తో పేకప్ చెప్పేసాడు. కేవలం నాలుగైదు రోజుల ప్యాచ్ వర్క్ తప్పితే అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మరోపక్క మరో మెగా హీరో రామ్ చరణ్ కూడా తన రంగస్థలం షూటింగ్ కి కూడా ప్యాకప్ చెప్పెయ్యబోతున్నాడట. సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో వస్తున్న రంగస్థలం షూటింగ్ ఒకటి రెండు రోజులు ప్యాచ్ వర్క్ మినహా టాకీ మొత్తం పూర్తయిందంటున్నారు. ఈ ఒక్కరోజు అంటే ఈ ఆదివారం ఒకరోజు గోపన్నపల్లి, ఇంకా ఒకటి రెండు చోట్ల ఒకటి రెండు షాట్ లు తీసేస్తే.... టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోతుందంటున్నారు.
కాకపోతే రెండు పాటల చిత్రీకరణమాత్రం బ్యాలెన్స్ ఉంటుందట. ఇక ఆ రెండు పాటలు కూడా గోదావరి జిల్లాల నేపథ్యంలో చిత్రీకరణ జరుపుతారని తెలుస్తుంది. పాటలు కూడా గ్రామీణ నేపథ్యంలో 1985 లోలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని కోట్ల ఖర్చుతో ఓ గ్రామం సెట్ నే నిర్మించారు. మరి అలనాటి పల్లెటూరి వాతావరణాన్ని తీసుకురావాలంటే... ఆ మాత్రం చెయ్యాలిగా. కాకపోతే గోదావరి జిలాల్లో షూటింగ్ కానిచ్చేద్దామంటే.. అక్కడ అభిమానుల తాకిడి తట్టుకోలేక ఇలా గ్రామీణ వాతావరణం లాంటి సెట్ నిర్మించాల్సి వచ్చి రంగస్థలం బడ్జెట్ పెరిగిందనే టాక్ ఉంది.
ఇకపోతే షూటింగ్ కంప్లీట్ కావడం.. పాటలు చిత్రీకరణ త్వరలొనేముగించేసి.. అక్కడి నుంచి రెండు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడమే తరువాయి.. సినిమా విడుదలకు సిద్ధం అంటూన్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

