మెగా హీరోలను ప్రొటెక్ట్ చేసుకున్న చెర్రీ

మెగా ఫామిలీ కథానాయకులు అందరికి ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్ ఉంటుంది. వారితో సినిమాలు తీయటానికి కాల్ షీట్స్ కోసం అనేకమంది ప్రముఖ నిర్మాతలు పోటీపడుతుంటారు. దర్శక రచయితలు వారి బాడీ లాంగ్వేజ్ కి, అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని కథలు సిద్ధం చేయటానికి లైన్ లో నిలుచుంటారు. ఈ మధ్య ఒక భాషలో విజయం పొందిన చిత్రాన్ని ఇతర భాషల్లోకి రీమేక్ చేయటం సర్వ సాధారణం అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి వారు రీమేక్ లకి దూరంగా ఉన్నప్పటికీ మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, తమిళంలో రజని కాంత్ వంటి స్టార్ హీరోస్ కూడా రీమేక్ లు చేసినవారే. అయితే చిరు తన కం బ్యాక్ చిత్రానికి కూడా రీమేక్ నే ఎంచుకోవటంపై కొన్ని అసంతృప్తి అభిప్రాయలు వ్యక్తమైన మాట వాస్తవమే. హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న రామ్ చరణ్ తేజ్ రిస్క్ చేయలేక రీమేక్ చేస్తున్నారు అని కామెంట్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న కాటమరాయుడు చిత్రం కూడా తమిళ రీమేక్ కావటంతో ధ్రువ ప్రచార కార్యక్రమాలలో ఒక విలేకరి రీమేక్ ఎందుకు చేస్తున్నారు అని వేసిన ప్రశ్న ని చెర్రీ కొంచం డీప్ గా తీసుకుని సమాధానం ఇచ్చాడు.
"ఏ రీమేక్ చిత్రమైతే అందులో మాత్రం కథ లేదా? వరుసగా స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు చేసినప్పుడు ఎందుకు అడగలేదు వరుసగా ఇలానే ఎందుకు చేస్తున్నారు అని? ఐన రీమేక్ చేయటంలో తప్పు లేదు. వేరే భాషలో విజయం పొందిన చిత్రాన్ని మన భాష ప్రేక్షకులకు కూడా చేరువ చేసే ఆలోచనతో రీమేక్ చేస్తుంటాం. స్ట్రెయిట్ తెలుగు చిత్రమైనా, రీమేక్ చిత్రమైనా మా కష్టం మారదు, అల్టిమేట్‌గా మాకు కావాల్సింది చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కటమే. రీమేక్ చిత్రాలు చేస్తుంటే మన రచయితలు సరైన కథలు చేయట్లేదు అనే ప్రచారం చేస్తున్నారు. అది కూడా సబబు కాదు. ఒకవేళ మీరు ఆలోచించిందే కరెక్ట్ అయితే మన రచయితల కథలు ఇతర భాషల్లోకి ఎందుకు రీమేక్ అవుతున్నాయి? నేను చేస్తున్న ధ్రువ కానీ, నాన్న చేస్తున్న ఖైదీ నెం.150 అయినా మాతృక కు మించిన ఔట్పుట్ ఇవ్వటానికే కృషి చేసాం. అంతిమ తీర్పు ప్రేక్షకులే నిర్ణయిస్తారు." అంటూ అసలు విషయం దివెర్త్ చేస్తూ తెలివిగా రీమేక్ లు సమర్ధిస్తూ సమాధానమిచ్చాడు చెర్రీ.

