Sun Dec 21 2025 22:16:21 GMT+0000 (Coordinated Universal Time)
మెగా హీరో బ్యాక్ టు వర్క్

పాపం మెగా హీరో వరుణ్ తేజ్ గత రెండు నెలలుగా కాలు ఫ్రాక్చర్ తో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ తన రెండు సినిమాల షూటింగ్స్ కి దూరమైయ్యాడు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వరుణ్ తేజ హీరోగా 'మిస్టర్ 'సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ సమయం లో వరుణ్ కాలికి దెబ్బతగిలింది. కాలికి ఫ్రాక్చర్ కావడంతో వరుణ్ ని డాక్టర్స్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇక అప్పటినుండి వరుణ్ తేజ్ తన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ కాలి ఫ్రాక్చర్ మూలంగా శేకేర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న 'ఫిదా' మూవీ షూటింగ్ కూడా వాయిదా పడింది.
ఇక ఇన్ని రోజులనుండి రెస్ట్ తీసుకుంటున్న వరుణ్ తేజ్ కాలు గాయం పూర్తిగా మానిందని ఇక వరుణ్ అతని పనులు నిరభ్యంతరం గా చేసుకోవచ్చని డాక్టర్స్ సూచించడంతో రిలాక్స్ అయినా వరుణ్ మునుపటి ఉత్సాహం తో తన సినిమాల షూటింగ్ కి రెడీ అయిపోయాడు. ఇక వరుణ్ చాలా రోజుల తర్వాత ఈ రోజే షూటింగులో పాల్గొంటున్నానని నా కాలి గాయం నుండి పూర్తిగా కోలుకున్నానని ట్వీట్ చేసాడు. ఇంకేముంది ఇక తన సినిమాల షూటింగ్స్ పరిగెత్తిస్తానని పూర్తి ఉత్సాహం తో ఉరకలు వేస్తున్న సంతోషం తో తన అభిమానులకు తెలియజేశాడు.
Next Story

