మెగా స్టార్ కి వలవేస్తున్నారు..!!

మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చెయ్యడమూ.. 'ఖైదీ..' తో హిట్ కొట్టడము చక చకా జరిగిపోయాయి. ఇప్పుడు 151 వ సినిమా ని మొదలు పెట్టడానికి చిరు అండ్ బ్యాచ్ చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' సినిమాని భారీ బడ్జెట్ తో భారీగా మొదలుపెట్టాలని.. చిరు చూస్తున్నాడు. ఇప్పటికే డైరెక్టర్, నిర్మాత ఈ చిత్రానికి సెట్ అయ్యారు. కానీ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటూనే వుంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడా చిరు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని అంటున్నారు.
ఇక వచ్చే నెల ఆగష్టు న ఈ సినిమా సెట్స్ మీదకెళుతుందని డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ లు చెబుతున్నప్పటికీ ఈ సినిమా సెట్స్ మీదకెళ్లడానికి మరో ఆరునెలలు టైం పట్టొచ్చనే టాక్ వినబడుతుంది. ఇక అలా టాక్ బయటికి వచ్చిందో లేదో ఇలా టాలీవుడ్ లోని కొందరు దర్శకులు చిరు కి గాలం వెయ్యడానికి రెడీ అవుతున్నారు. చిరు ఉయ్యాలవాడ.. మొదలవ్వడానికి మరో ఆరు నెలలు టైం ఉండడంతో ఈలోపు చిరంజీవితో ఒక మూవీ చేసెయ్యాలనే యోచనలో కొందరు డైరెక్టర్స్ ఉన్నారట.
చిరంజీవికి సింపుల్ గా ఒక కథ వినిపించేసి ఈ ఆరు నెలలో అటు ఇటుగా ఆ సినిమా చేసేయాలని ఉత్సాహంతో కొందరు మెగా స్టార్ కోసం వల విసురుతున్నారనే టాక్ కూడా ఫిలింనగర్ సర్కిల్స్ లో వినబడుతుంది. మరి చిరు వారు ఆశిస్తున్నట్లు
ఒక ఆరునెలల టైం హరీబరిగా వారికి ఇస్తాడా...? లేకపోతె ఎందుకులే నెమ్మదిగానైనా ఉయ్యాలవాడతోనే మళ్ళీ సెట్స్ మీదకెళదామనుకుంటాడో అనేది మాత్రం ఫుల్ సస్పెన్సు.

