మెగా డ్యాన్సుల్లో లారెన్స్ కనిపించకుండా ఉంటే మేలు!

హీరోగా, డైరెక్టర్ గా లారెన్స్.ఏం సాధించాడేమోగానీ.. పెద్ద హీరోలతో తీసే పాటల్లో కనిపించాలనే అత్యుత్సాహం మాత్రం బాగా తీర్చుకున్నాడు.. చిరంజీవికి ఎన్నో సూపర్ హిట్ పాటలు చేసినా.. మృగరాజులో చాయ్ చమక్కులే చూడరా భాయ్ అంటూ చిరంజీవి కలిసి చిందులేసేశాడు లారెన్స్. అప్పటి నుంచి దాదాపు తను చేసే పెద్ద హీరోల పాటల్లో అంతా ఎప్పుడో ఒకప్పుడు కనిపించేలా జాగ్రత్త పడుతున్నాడు.. చిరంజీవి, నాగార్జున అందరి పాటల్లో కనిపించి తన మార్కు స్టెప్పులతో కాస్త డామినేట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటాడు.. కానీ ఆ పాటల్లో అతిథిలాగా మారిపోతుంటాడు.. తనను తాను బాగా పబ్లిసిటీ చేసుకునే లారెన్స్... ఇక మెగాస్టార్ 150 మూవీలో అవకాశం వస్తే వదులుతాడా.. ఆ ఛాన్సే లేదు.
పైగా లారెన్స్ తో సాధారణంగా మరో సమస్య కూడా ఉంది. లారెన్స్ కంటూ ట్రేడ్ మార్క్ స్టెప్ లు కొన్ని ఉంటాయి. తను హీరోగా కూడా చేసిన వ్యక్తి గనుక.. ఆ తరహా స్టెప్పులు తెరమీద కనిపించగానే.. ప్రేక్షకులు అసలు చేస్తున్న స్టార్ ను మరచిపోయి, లారెన్స్ ను గుర్తుచేసుకునే ప్రమాదం ఎక్కువ. చిరంజీవికి కూడా ఆ ఇబ్బంది ఉంది. లారెన్స్ కంపోజ్ చేసిన చాలా పాటల్లో.. లారెన్స్ తెరమీద కదులుతున్నట్లే చిరు కదలికలు అనుభూతి ఇస్తాయంటే అబద్ధం కాదు. అలాంటి లారెన్స్ కు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది.
ఈ చిత్రంలో తనకు దొరికిన ఒకే ఒక ఐటంసాంగ్ ను తనకు నచ్చిన రేంజిలో ఏదో ఒకటి చేయాలని కంకణం కట్టుకున్నాడో.. ఏమో.. పాట షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచీ దాన్ని ఎలాగోలా వార్తల్లో నిలిచేలా చేస్తున్నాడు. తొలిరోజే కేథరీన్ తెరీసాను ఎలాగోలా బయటకు పంపేసి.. తనకు బాగా నచ్చిన లక్ష్మీరాయ్ కు చిరు పక్కన ఎంట్రీ ఇప్పించేశాడు. ఇప్పుడు ఆ పాటకు మరింత పబ్లిసిటీ తెచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేసేస్తున్నాడు.. దీంతో చిరుతోపాటూ కచ్చితంగా లారెన్స్ కూడా గంతులేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్.. అసలే ఆ పాటలో రాంచరణ్ కూడా కనిపిస్తారనే ప్రచారం ఉంది. అసలే మెగాస్టార్ 150వ మూవీ కదా.. స్క్రీన్ అంతా చాలా రోజుల తర్వాత వచ్చిన మెగాస్టార్ స్టెప్పులనే చూసేయాలనుకుంటుంటే.. మధ్యలో లారెన్స్ కూడా ఎంట్రీ ఇచ్చి పాటను కల్తీ చేసేస్తాడేమోనని కంగారు పడిపోతున్నారు. ఇప్పటికే ఐటంసాంగులో తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్న లారెన్స్.. దేవిశ్రీ పాట, చిరు ఆటా చూసేయచ్చని హుషారెత్తిపోతున్న మెగా ఫ్యాన్స్.. ఈ పాట షూటింగ్ పూర్తయ్యేలోపు లారెన్స్ ఇంకా ఏమేం మార్పులు చేర్పులు చేస్తాడోనని కంగారు పడిపోతున్నారు.

