మెగా ట్యాగ్ ఉన్నవారంతా ’150‘ కోసం పనిచేస్తున్నారట

చిరంజీవి తన 150 చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకం గా ఎప్పటికి గుర్తుండిపోయేలా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ సినిమా మొదలైనప్పుడే సరైన కథ దొరకక కొన్ని రోజులు, ఏ డైరెక్టర్ అయితే ఈ సినిమాని బాగా తెరకెక్కించగలడో అని ఆలోచనలకే చాలా టైం తీసుకుని చివరికి తమిళ్ సినిమా కత్తిని రీమేక్ చేస్తున్నారు. ఇక మాస్ చిత్రాల దర్శకుడు వి.వి వినాయక్ ని డైరెక్టర్ గా ఈ సినిమాకి సెట్ చేశారు. ఇక ఈ 150 సినిమా నిర్మాణాన్ని చిరు బావ అల్లు అరవింద్ చేపడతాడనుకుంటే... కాదు చిరు భార్య నేను చేస్తా... మా ఆయన 150 సినిమాని అని ఆమె నిర్మాతగా ముందుకు వచ్చింది. అయితే సురేఖ కి ఈ సినిమా నిర్మాణము అదీ కొత్త కాబట్టి చిరు కొడుకు చరణ్ అన్ని బాధ్యతలు తన నెత్తి మీద వేసుకుని తన తల్లి ముందు నిలబడి అన్ని పనులు చక్కబెడుతున్నారు. ఇక ఈ సినిమా మొదలై షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ హీరోయిన్ మరియు టైటిల్ చాలాకాలం వరకు సెట్ చేయలేకపోయారు.
హీరోయిన్ గా రక రకాల పేర్లు వినబడినప్పటికీ చివరికి కాజల్ ని ఫైనల్ చేసారు. ఇక టైటిల్ విషయం లో కూడా ఎన్నో టైటిల్స్ అనుకుని లాస్ట్ కి ఖైదీ నెంబర్ 150 కి ఫిక్స్ అయ్యారు. ఇక చిరు 150 సినిమాకి చిరు పెద్ద కూతురు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తుంది. సుస్మిత ఒకప్పుడు జై చిరంజీవ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసింది. ఇక తర్వాత పెళ్లి, పిల్లలు ఇలా చాలా కాలం ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా విరామం తీసుకుంది. కానీ ఇప్పుడు తన తండ్రి చిరు కెరీర్ కి చాల ఇంపార్టెంట్ అయిన 150 సినిమాకి తానె కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తూ పూర్తిగా తన తండ్రి సినిమాకే టైం కేటాయిస్తోంది. ఇక చిరు 150 వ సినిమాలో చిరు తమ్ముడు నాగ బాబు కూతురు ఒక గెస్ట్ రోల్ లో కనబడుతుందని సమాచారం. ఇక మెగా హీరోలంతా ఈ సినిమాకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారని సుస్మిత చెబుతుంది. అంటే డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా మెగాస్టార్ 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 కోసం కష్టపడుతున్నారని సుస్మిత చెబుతోందన్నమాట.

