మెగా ఆశీస్సులు అదిరాయ్

హలో అనే మాట ఇప్పుడు నిత్యం రోజువారీ జీవనంలో మనం ఎన్నో సార్లు వింటూనే ఉన్నాం. ఫోన్ ఎత్తిన ప్రతిసారి అందరూ చెప్పే మొదటి మాట హలో. అంతేకాకుండా ఇద్దరు వ్యక్తులు లాంగ్ గ్యాప్ తర్వాత కలిసిన హలో అంటూ ఆప్యాయంగా పలకరించుకుంటాం. ఇప్పుడు రోజువారీ జీవితంలో ఒక పార్ట్ గా మారిన హలో అనే టైటిల్ తో అఖిల్ నటించిన హలో మూవీ రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగార్జున నిర్మాణంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాల నడుమ ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా పీక్స్ లో ఉన్న హలో సినిమ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ చిరు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిధులుగా నిన్న బుధవారం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది.
హలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన చిరంజీవి ఇప్పటికే హలో సినిమా చూశానని... సినిమా మొత్తం అదిరిపోయేలా ఉందని.. హలో ఫంక్షన్ లో మాట్లాడాడు. అంతేకాకూండా హలో అనే మాటకు అక్కినేని ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉందని... హలో హలో ఓ అమ్మాయి అంటూ అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు పాటతో హిట్ కొట్టారని.. తరవాత హలో గురు ప్రేమకోసమే పాటతో నాగార్జున, అమల జంట పాపులర్ అయిపోయిందని.. తరవాత హలో బ్రదర్ అంటూ నాగ్ హిట్ కొట్టాడని గుర్తు చేశారు. ఇప్పుడు అదేమాదిరి అఖిల్ కూడా హలో అంటూ మన ముందుకొస్తున్నాడని .. హలో సినిమాతో అఖిల్ కూడా సూపర్ హిట్ కొడతాడని చెప్పాడు.
అలాగే ముందే హలో సినిమాని చూసిన నేను ఆ సినిమా గురించి చెప్పాలంటే... విడుదల కు ముందు సినిమా చూడటం అనేది ఒక పరీక్ష లాంటిది. ఎందుకంటే సినిమా చూసాకా ఆ సినిమా ఎలా వున్నది అని చెప్పాలంటే.. అబద్ధం ఆడలేం. కానీ ఈ హలో సినిమా మొదటి నుంచి చివరి వరకు అందరినీ ఆకట్టుకునే క్లీన్ లవ్ స్టోరీ. అంతేకాకుండా హలో సినిమాలోయాక్షన్ సీన్స్ మార్వలెస్ గా ఉన్నాయి. అఖిల్ డ్యాన్సులు గ్రేస్ ఫుల్ గా ఉన్నాయి. ఇంతవరకు అక్కినేని ఫ్యామిలీలో ఎవరూ చేయలేని విధంగా పాట కూడా అఖిల్ పాడేసాడు. అలాగే అఖిల్ నాన్న.. తాతలను మించి నటుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని.... అఖిల్ కి మెగా ఆశీస్సులు అందించేసాడు మెగాస్టార్.

