మూడు పాత్రలు మూడు ఆణిముత్యాలే!

ఒక సినిమాలో హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు అంటేనే సినిమాలో ఇద్దరు ఎలాంటి పత్రాలు చేయబోతున్నారో... అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. అసలు హీరోలు కొన్ని సినిమాల్లో ద్విపాత్రాభినయం చెయ్యడం అనేది ఈ కాలంలో బాగా కామన్ అయ్యిపోయింది. కానీ ఒకే హీరో ఒక సినిమాలో త్రిపాత్రాభినయం అంటే.. చాల కష్టమైనా పనే. అసలు ఇలా మూడు పాత్రల్లో నటించడం అంటే రిస్క్ అనే హీరోలు కూడా చాలామందే ఉన్నారు. ఒకవేళ మూడు పాత్రలు ఒకే హీరో చేస్తే ....సినిమా మొత్తంగా ముగ్గురు కలిసి కనబడే సన్నివేశాలని చూడాలి అంటే ప్రేక్షకులకు రెండు కళ్ళు సరిపోవు.
మరి ఇలాంటి ప్రయోగాలు చేసిన వారు మొదటగా మనకు తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ లాంటి హీరోలు కనబడతారు ఇక ఆ జెనరేషన్ లో సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహించిన దాన వీర శూర కర్ణ చిత్రంలో.. కర్ణుడిగా, కృష్ణుడిగా, ధుర్యోధనుడిగా ఇలా మూడు పాత్రలు చేసి అందరి మదిలో నిలిచిపోయారు. ఆయన తారావతి జెనరేషన్ లో మళ్ళీ ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించి మెప్పించాడు. ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో చిరు ఒక పాత్ర రౌడీగా, మరొకపాత్రలో పోలీస్ గా, ఇంకొక పాత్రలో బ్రాహ్మణుడిగా నటించి ఇరగదీసాడు.
ఇక ఇప్పుడు ఈ యంగ్ జెనరేషన్ లో ఆ మూడు పాత్రలను జూనియర్ ఎన్టీఆర్ జై లవ కుశలో చేసి ప్రేక్షకులను బాగానే మెప్పించాడు. జై లవ కుశ లో జై గా.... ఉగ్రరూపంతో నెగెటివ్ గా కనబడి అదరహో అనిపించాడు. ఇక లవ గా అతిమంచి తనంతో... రాముడు మంచి బాలుడు అనే తరహాలో ఆకట్టుకోగా... కుశుడుగా బాగా కామెడీ చేస్తూ సూపర్బ్ అనిపించాడు. ఇక జై లవ కుశలో ఇంటర్వెల్ తర్వాత జై లవ కుశలు స్క్రీన్ మీద ఒకేసారి కనబడుతూ అందరిని మెప్పించారు. ఈ జెనరేషన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఈ త్రిపాత్రాభినయంతో బాగా ఆకట్టుకున్నాడనే చెప్పాలి.

