మూడు నెలలు ఫ్రెష్ అవుతాడా?

ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమా విడుదల కావడం.. ఆ సినిమా మిక్సడ్ టాక్ తో విజయవంతంగా 100 కోట్ల క్లబ్బుని చేరుకోవడం చక చకా జరిగిపోయాయి. అలాగే బుల్లితెర మీద కొత్తగా ట్రై చేసిన ఎన్టీఆర్... వ్యాఖ్యాతగా చేసిన బిగ్ బాస్ షో కూడా సక్సెస్ అవడం... ఆ షో మొదటి సీజన్ ముగియడంతో ఎన్టీఆర్ పూర్తిగా ఖాళీ అయ్యాడు. అయితే ఎన్టీఆర్ తన నెక్స్ట్ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇక ఎన్టీఆర్ ఖాళీ అయినా త్రివిక్రమ్ మాత్రం పవన్ సినిమాలో లాక్ అయ్యాడు. మరి ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఖాళీ అయ్యేవరకు ఏం చేస్తాడు అంటే.. మొదటినుండి చెబుతున్నట్టు ఒకమూడునెలలపాటు విదేశాలకు వెళ్లి రిలాక్స్ అయ్యి పూర్తిగా ఫ్రెష్ అవవలనుకుంటున్నాడు.
రెస్ట్ అవసరమంటున్న జూనియర్.....
అందుకే వచ్చే జనవరి వరకు సినిమాల జోలికి వెళ్లకుండా... రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాడట ఎన్టీఆర్. కానీ దిల్ రాజు మాత్రం త్రివిక్రమ్ ఖాళీ అయ్యేలోపు ఒక సినిమా చేద్దామని ఎన్టీఆర్ ముందు ప్రపోజల్ పెట్టాడట. కానీ ఎన్టీఆర్ మాత్రం గత మూడు నెలల కాలాన్ని తలుచుకుని వద్దనేశాడట. గత మూడు నెలలుగా జై లవ కుశ షూటింగ్ తో బిగ్ బాస్ షూటింగ్ తో అలిసిపోయిన ఎన్టీఆర్ కి ఒక మూడు నెలలు రెస్ట్ అవసరమనుకుంటున్నాడట. అందుకే దిల్ రాజు ప్రపోజల్ ని ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించాడట.
యూరప్ ట్రిప్.....
ఇక ఈ మూడు నెలలు తన కుటుంబంతో కలిసి సరదాగా యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడట ఎన్టీఆర్. ఈ మూడు నెలలు ఫ్యామిలీ కి టైం కేటాయించి ఆతర్వాతే త్రివిక్రమ్ తో సినిమా కోసం సిద్దమవుతాడట. అయితే ఈ లాంగ్ వెకేషన్ లో ఎన్టీఆర్ మరో ప్లాన్ కూడా చేస్తున్నాడట. అదేమిటంటే జై లవ కుశ లో కొద్దిగా లావై ఎన్టీఆర్ మళ్ళీ ఎబ్బెట్టుగా మారిపోతున్నాడనే కామెంట్స్ వలన ఎన్టీఆర్ ఈ మూడు నెలల వెకేషన్ లో కొద్దిగా లావు తగ్గే ప్రయత్నాలు కూడా చేస్తాడనే టాక్ వినబడుతుంది. మరి త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ బాడీ పర్ఫెక్షన్ కోసం కొత్తగా ట్రై చేస్తున్నాడనే టాక్ మొదటినుండి ఉండనే వుంది.
- Tags
- ఎన్టీఆర్

