మహేష్‌బాబు షూటింగ్లో అగ్నిప్రమాదం

మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో బైలింగువల్ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రం లో మహేష్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ సగం కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ షూటింగ్ జరిగే ఏరియాలో అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం. ఫిలింనగర్ రోడ్ నెంబర్ 87లో ఈ చిత్రం కోసం వేసిన సెట్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగిందట. షూటింగ్ కోసం వేసిన సెట్ కి పక్కన కొంతమంది దీపావళి టపాసులు కలుస్తుండగా ఆ నిప్పురవ్వలు ఎగిరి సెట్ లో పడడం వలన ఈ ప్రమాదం జరిగిందట. ఇక ఈ ప్రమాదం లో షూటింగ్ కి సంబంధించి టెంట్లు, కొంత షూటింగ్ సామాగ్రి కాలిపోయినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం జరిగిన టైం కి షూటింగ్ ఇంకా మొదలుకాక పోవడం తో ప్రాణ నష్టం జరగలేదని.... కానీ ఆస్థి నష్టం కొంచెం బాగానే జరిగిందని అంటున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

