మహేష్ స్పైడర్ పై ట్వీట్స్!!

మహేష్ బాబు - మురుగదాస్ కలయికలో తెరకెక్కిన స్పైడర్ చిత్రం ఒకసారి మిశ్రమ స్పందన, మరోసారి నెగెటివ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. సినిమా ఎలా వున్నా అందులోని మహేష్ బాబు యాక్టింగ్ బావుంది అంటున్నారు కొందరు. తన పాత్రకి పెద్దగా విషయం లేకపోయినా తన స్టైలిష్ తో, తన లుక్స్ తో, అలాగే సూపర్ పెరఫార్మెన్సు తో ఇరగదీశాడనే కామెంట్స్ పడుతున్నాయి. నిన్న బుధవారమే థియేటర్స్ లోకొచ్చిన స్పైడర్ చిత్రం బావుంది అంటూ కొందరు సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు.
మహేష్ పెర్ ఫార్మెన్స్ పై.....
దర్శకుడు హరీష్ శంకర్ అయితే స్పైడర్ సినిమా ఓ సరికొత్త అనుభూతిని పంచుతుందని.... మరుగదాస్ దర్శకత్వం, మహేశ్ నటన మెప్పించాయని ట్వీట్ చేశాడు. సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ కూడా మహేశ్ బాబు పెరఫార్మెన్స్ ని పొగడ్తల్లో ముంచెత్తాడు. మహేశ్ బాబు కి సినిమాపై అంకిత భావం, పడ్డ కష్టం మరోసారి దర్శకుడి హీరోగా నిరూపించిందన్నాడు. అలాగే మరో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కూడా స్పైడర్ సినిమా గురించి ట్వీట్ చేయడం ఇక్కడ విశేషం. స్పైడర్ సినిమాలో మహేశ్ బాబు, విలన్ గా చేసినఎస్జె సూర్యల నటన గురించి విన్నానని.... దర్శకుడు మురుగదాస్‌కు.... చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ చెబుతూ ట్వీట్ చేసింది.
- Tags
- స్పైడర్

