మహేష్ మేనకోడలు ఎలా వుంది?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా కుటుంబాల నుండి వారసులుగా హీరోలు మాత్రమే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు గాని... అమ్మాయిలు మాత్రం చాలా రేర్ గా సినిమా అరంగేట్రం చేస్తుంటారు. అదే బాలీవుడ్ లో అయితే సినిమా హీరోహీరోయిన్స్ తమ కూతుళ్ళని సినిమాల్లోకి తేవడానికి మాత్రం తీవ్రంగా కృషి చేస్తారు. కానీ తెలుగులో అలా కాదు. సినిమా హీరోల ఇంటినుండి ఒక అమ్మాయి సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది అంటేనే ఆయా హీరోల అభిమానులే ఒప్పుకోరు. అంతెందుకు మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు కూతురు వస్తుందంటే మెగా ఫాన్స్ ఎంతలాంటి రచ్చ చేశారో తెలిసిందే. అయితే ఘట్టమనేని కృష్ణ ఫ్యామిలిలో కూడా ఆయన కూతురు మంజుల కూడా మొదట్లో హీరోయిన్ అవుదామనుకుందట. కానీ అప్పట్లో ఘట్టమనేని ఫ్యాన్స్ అభ్యంతరాలు చెప్పడంతో ఆమె ఆ ఆలోచన విరమించుకుని కొన్ని సినిమాల్లో మాత్రం కొన్ని కేరెక్టర్స్ చేసి గుర్తింపు పొందింది.
అయితే ఇప్పుడు మంజుల తన కూతురిని సినిమాల్లోకి దించాలనే ఆలోచనలో ఉంది. కేవలం ఆలోచనే కాదు అప్పుడే ఆచరణలో కూడా పెట్టేసింది కూడా. ఈమధ్యనే హాఫ్ సారీ ఫంక్షన్ ని గ్రాండ్ గా జరిపించిన మంజుల ఇప్పుడు ఎలాగైనా తన కూతురు జాన్విని హీరోయిన్ గా చూడాలని ఇప్పటి నుండే వెండితెరను పరిచయం చేయిస్తోంది. అది కూడా తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక ప్రేమ కథ చిత్రం ద్వారా జాన్వీ ని వెండితెరకి పరిచయం చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ స్పాట్ పిక్ ఒకటి నెట్ లో హల్చల్ చేస్తుంది.
ఆ పిక్ లో సందీప్ పక్కనే కనిపిస్తున్న అమ్మాయే మంజుల కూతురు జాన్వీ. అయితే మంజుల మాత్రం తనను ఎప్పుడు షూటింగ్ లోకి రానివ్వలేదు. అందుకే మొదటి సారి తను షూటింగ్ లోకి రాగానే నర్వస్ గా అనిపించింది. కానీ మొదటి సీన్ షూట్ చేసిన తర్వాత తనపై నాకు నమ్మకం పెరిగింది. తను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పటి మహేష్ ను గుర్తు చేస్తోంది. మరి ఈ టీనేజీ అమ్మాయికి మున్ముందు హీరోయిన్ అయ్యే ఆలోచనలు కూడా ఉన్నాయట. మరి మహేష్ మేనకోడలిగా జాన్వీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి.

