మహేష్ చెవిలో సీక్రెట్!!

మహేష్ బాబు పిల్లలు ఎప్పుడూ భలే యాక్టీవ్ గా వుంటారు. మహేష్ కి వీలు చిక్కినప్పుడల్లా వారితో టైమ్ స్పెండ్ చేస్తూ భలే ఎంజాయ్ చేస్తుంటాడు. మహేష్ కి తాను చేసే పనిమీద ఎంత కమిట్మెంట్ ఉంటుందో... తన ఫ్యామిలీ మీద కూడా కమిట్మెంట్ ఉంటుంది. అందుకే షూటింగ్ మధ్యలో గ్యాప్ వచ్చినపుడల్లా తన ఫ్యామిలీ ని తీసుకుని మహేష్ విదేశాలకు చెక్కేస్తాడు. అక్కడ తన భార్య పిల్లల్తో ఎంతగా ఎంజో చేస్తాడో మహేష్ భార్య నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తూ తెలియజేస్తుంది. అంతేనా ఎక్కడికన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు కూడా మహేష్ ఎంచక్కా తన పిల్లలు భార్యతో హాజరవుతారు.
ఆ ఫంక్షన్స్ లో సితార, గౌతమ్ చేసే అల్లరిని మహేష్ బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక ఇప్పుడు కూడా రీసెంట్ గా వేసవి సెలవలకి తన పిల్లలని తీసుకుని లండన్ వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చాడు. అక్కడ లండన్ లో తన పిల్లలతో మహేష్ ఎలా ఎంజాయ్ చేసాడో నమ్రత ఫొటోస్ తీసి మరీ.. సోషల్ మీడియాలోషేర్ చేసింది. ఇక ఆ ఫొటోస్ లో మహేష్ చెవిలో సితార ఏదో సీక్రెట్ చెప్పేస్తుంది. ఆ సీక్రెట్ ఏమిటో తెలియదు గాని.... సితార మాత్రం మహేష్ చెవిదగ్గర ఏదో చెబుతూ భలే క్యూట్ గా వుంది. ఆ పక్కనే గౌతమ్ కూడా ఏదో పనిలో బాగా బిజీగా వున్నాడు. ఇక సితార చెప్పిన సీక్రెట్ విని మహేష్ కూడా తెగ నవ్వేసుకుంటున్నాడు. మరి మీరు ఆ పిక్ ని చూసి ఎంజాయ్ చెయ్యండి.

