మహేష్ అరుదైన రికార్డ్

మహేష్ బాబు సోషల్ మీడియా లో ఓ అరుదైన రికార్డు నమోదు చేసాడు. ట్విట్టర్ లో మనవాడి ఫాలోవర్ల 5 మిలియన్.... అంటే 50 లక్షలు ఫాలోవర్స్ అన్న మాట. తెలుగులో మరే హీరోకూ సాధ్యం కాని రీతిలో ట్విట్టర్లో 5 మిలియన్ మార్కును అందుకున్నాడు మహేష్. సౌత్ ఇండియన్ స్టార్స్ లో ఇప్పటిదాకా 5 మిలియన్ మార్కును దాటింది ఇద్దరే కావడం విశేషం. ఒకరు ధనుష్ 6.4 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకోగా..సమంత 5.71 మిలియన్ ఫాలోవర్లతో ఉంది.
తెలుగు లో మహేష్ బాబు స్థానం తర్వాత కింగ్ నాగార్జున 4.5 మిలియన్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. నాగార్జున తర్వాత దగ్గుబాటి రానాకు 4.48 మిలియన్ ఫాలోవర్లున్నారు. కొంచం లేటుగా వచ్చినా పవర్ స్టార్ కు 22 లక్షలు మంది ఫాలోవర్స్ ఉన్నారు. రాజమౌళి 3.75 మిలియన్ ఫాలోవర్లతో కొనసాగుతున్నాడు. రెండేళ్ల కిందట ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ వెనుక 17 లక్షల మంది ఉన్నారు.

