మహేషా మజాకా

గత పదేళ్ల నుండి చూస్తుంటే మన ఇండియన్ సినిమా మార్కెట్ బాగా పెరిగిపోయింది. అలానే స్టార్ హీరోల క్రేజ్ కూడా పెరిగిపోయింది. సినిమాలు రిలీజ్ అయ్యాక కలెక్షన్స్ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మాత్రం మాములుగా లేదు. లేటెస్ట్ గా భరత్ అనే నేను కూడా అలాంటి రికార్డునే అందుకుంది.
మహేష్ - కొరటాల కాంబినేషన్ లో వస్తున్నా ఈ చిత్రంపై మొదటి నుండి అంచనాలు వున్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా టీజ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. టాలీవుడ్ లో మోస్ట్ లైకెడ్ టీజర్ గా రికార్డు సృష్టించింది.
ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి టీజర్ అత్యధిక లైకులు అందుకున్న మొదటి టీజర్ గా అందుకుంటే దానిని మహేష్ బాబు బ్రేక్ చేసి రికార్డును సృష్టించాడు. ఈ సినిమా ప్రభావం చూస్తుంటే..రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 20న మన ముందుకు రానుంది.

