మహానటి గురించి మంచు ట్వీట్

నాగ్ అశ్విన్ దర్శకుడిగా మహానటి సావిత్రి బయో పిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహానటిగా కీర్తి సురేష్ నటిస్తుంది. అలాగే మరో ముఖ్యమైన పాత్రలో సమంత నటిస్తుండగా.. జెమిని గణేశన్ పాత్రకి మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, అర్జున్ రెడ్డి ఫెమ్ షాలిని పాండే కూడా ఈ సినిమాలో నటిస్తుంది. అయితే మహానటి సావిత్రి జీవితంలో ముఖ్యమైన వ్యక్తి ఎస్వీ రంగా రావు పాత్రని మోహన్ బాబు పోషిస్తున్నాడు. తాజాగా మహానటి సెట్స్ ని విజిట్ చేసిన మంచు విష్ణు మహానటి సినిమా గురించి ట్వీట్ చేసాడు.
మహానటి గా కీర్తి సురేష్ సూపర్ గా ఉందని.. అలాగే తన తండ్రి ఎస్వీఆర్ పాత్రలో సూపర్ అని... కీర్తి సురేష్ లుక్ మహానటి సావిత్రిని గుర్తుకు తెచ్చిందని.. మళ్ళీ ఇన్నాళ్ళకి సావిత్రి గారి గురించి తెలుసుకోవడం ఆనందంగా ఉందని పోస్ట్ చేసాడు మంచు విష్ణు. మరి నిజంగానే విష్ణు చెబుతున్నాడని కాదుగాని... మహానటి లుక్ లో కీర్తి సురేష్ మరిపించేలా ఉందని చిత్ర బృందం మొదటినుండి చెప్పడమే కాదు... మొన్న కీర్తి పుట్టిన రోజు కానుకగా విడుదల చేసిన మహానటి సావిత్రి కళ్ళలాగ కీర్తి కళ్ళు ఉండడం చూస్తుంటే కీర్తి సావిత్రిగా నటించడం లేదని జీవిస్తుంది అనే విషయం తెలుస్తుంది.

