మహాధన్.. ధన్ ధన్ మనిపించడానికి వచ్చేస్తున్నాడు

రవితేజ సినిమాల్లోకి మామూలు నటుడిగా వచ్చినప్పటికీ అనతికాలంలోనే మంచి ఎనర్జీ హీరోగా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎనర్జీతో దూసుకుపోతున్న రవితేజ గత ఏడాది ఒక్క సినిమాకి కూడా కమిట్ అవ్వకుండా లాంగ్ గ్యాప్ తీసుకుని ఈ ఏడాది మొదట్లో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' కాగా రెండోది విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు'. ఇక అందులో 'రాజా ది గ్రేట్' త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది
అయితే సినిమా ప్రపంచంలో రవితేజ మమేకమైనప్పటికీ తన ఫ్యామిలీని మాత్రం ఎక్కువగా బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ మధ్యనే కొన్నిసార్లు తన కుటుంబంతో కలిసి దిగిన సెల్ఫీలు సాంఘిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నాడు. ఇండస్ట్రీలో జరిగే పెళ్ళిళ్ళకి పేరంటాలకు ఎప్పుడూ ఫ్యామిలీతో హాజరుకాని రవితేజ ఇప్పుడు తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఆ వార్తలు నిజమే అని... రవితేజ కొడుకు హీరోగా కాకుండా జస్ట్ తన తండ్రి చిన్నప్పటి పాత్రలో మెరవబోతున్నాడట.
రవితేజ చేస్తున్న ‘రాజా ది గ్రేట్’ ఈ అక్టోబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత దిల్‌రాజు. ఇక మెహరీన్ కౌర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ చిన్ననాటి పాత్రకి 'రాజా ది గ్రేట్' కథలో ప్రాధాన్యత ఉండడంతో..... తొలుత చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరితోనైనా ఈ పాత్ర చేయించాలనుకున్నా.. తర్వాత అనిల్ రావిపూడి రిక్వెస్ట్‌తో రవితేజ కొడుకు మహాధన్‌తో ఆ పాత్ర చేయించారనే టాక్ వినబడుతుంది. సో... ఇలా రవితేజ కొడుకు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవబోతున్నాడన్నమాట.

