మళ్ళీ వీరో కాంబోలో మూవీనా..?

బాలకృష్ణ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ సెట్స్ మీదకెళ్లే వరకు వారి కాంబోలో సినిమా వస్తుంది అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కానీ వారి కాంబోలో సినిమా సెట్స్ మీదకెళ్ళడం... ఆ సినిమా రికార్డు స్థాయిలో పూర్తి కావడం.... విడుదలకు సిద్దమవడం జరిగిపోయాయి. ఇక వీరి కాంబోలో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రం వచ్చే శుక్రవారమే విడుదలకానుంది. వీరి కాంబినేషన్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. స్టంపర్, ట్రైలర్ తోనే బాలయ్య ఎనర్జీ పీక్స్ లో చూపించిన పూరి ప్రోమో సాంగ్స్ లో కూడా బాలయ్య డాన్స్ స్టెప్స్ ని చూపించేసాడు.
ఇక వీరి కాంబోలో సినిమా సెట్స్ మీదున్నప్పుడే బాలయ్య అంటే అభిమానమని ఆయనతో సినిమా చెయ్యడం అదృష్టమని పూరి చెప్పేవాడు. ఇక పూరి మార్క్ డైలాగ్స్ ఎలా ఉంటాయో 'పైసా వసూల్' లో చూడమని బాలయ్య కూడా చెబుతున్నాడు. ఇంకా ఈ సినిమా విడుదల కాకముందే వీరి కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. 'పైసా వసూల్' షూటింగ్ లోనే పూరి... బాలయ్యకి ఒక కథ వినిపించాడని... కథ విన్న బాలయ్య కూడా ఆ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడనే టాక్ నడుస్తుంది.
ఇక ఇప్పుడు పూరి, బాలయ్యని 'పైసా వసూల్' లో గ్యాంగ్ స్టర్ గా చూపెడుతుండగా... మళ్ళీ వీరి కాంబో లో రిపీట్ అయ్యే మూవీని మాత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తాడని అంటున్నారు. మరి మళ్ళీ వీరి కాంబో రిపీట్ అవ్వాలంటే ముందు 'పైసా వసూల్' విడుదలయ్యి ఆ సినిమా హిట్టవ్వాలిగా అంటున్నారు. నిజంగానే 'పైసా వసూల్' ఫలితం మీదే పూరి - బాలయ్య ల మరో సినిమా ఆధారపడివుంది. ఇక బాలయ్య తాజాగా కె ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో 102 వ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేసి సెట్స్ మీదకెళ్ళిపోయాడు.

