మళ్ళీ బెస్ట్ పట్టేసాడు!!

అబూధాబీలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) అదిరిపోయే లెవల్లో జరిగాయి. టాలీవుడ్ హీరోహీరోయిన్స్ ఈ అవార్డు వేడుకలకి సీతాకోక చిలుకల్లా హాజరై అందరిని ఆకర్షించారు. టాలీవుడ్ స్టార్స్ అంతా ఒక్కొక్కళ్ళు ఒక్కో టాలెంట్ తో అదరగొట్టేసాడు. అల్లు శిరీష్, లక్ష్మి మంచులు హోస్ట్ లుగా అదరగొట్టగా.... అఖిల్ అక్కినేని పాట పాడి అలరించాడు. అలాగే టాలీవుడ్ హీరోయిన్స్ కొంతమంది స్టేజి మీద డాన్స్ పెరఫార్మెన్సు తో ఇరగదీసాడు. ఇకపోతే ఈ సైమా వేడుకలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటనకు గాను జూనియర్ ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా... నాన్నకు ప్రేమతో చిత్రానికి గాను ఉత్తమ నటిగా రకుల్ ప్రీత్ సింగ్ అవార్డు అందుకుంది. చిన్న చిత్రంగా రిలీజై కలెక్షన్స్ వర్షం కురిపించిన పెళ్లి చూపులు చిత్రం ఇప్పటికే జాతీయ అవార్డు అందుకోగా... ఇప్పుడు సైమా లో బెస్ట్ చిత్రంగా అవార్డు కొట్టేసింది. ఇక ఊపిరి చిత్రానికి గాను వంశీ పైడిపల్లి కి ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. ఇక సైమా అవార్డ్స్ వినర్స్ లిస్ట్ మీ కోసం....
సైమా-2017 అవార్డుల వివరాలు:
ఉత్తమ చిత్రం: పెళ్లిచూపులు
ఉత్తమ నటుడు: ఎన్టీఆర్(జనతా గ్యారేజ్)
ఉత్తమ నటి: రకుల్ ప్రీత్‌సింగ్(నాన్నకు ప్రేమతో)
ఉత్తమ నటుడు(క్రిటిక్): నాని
ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (వూపిరి)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు)
ఉత్తమ తొలి చిత్ర నటుడు: రోషన్ (నిర్మలాకాన్వెంట్)
ఉత్తమ తొలి చిత్ర నటి: నివేతా ధామస్(జెంటిల్మన్)
ఉత్తమ సహాయనటుడు: శ్రీకాంత్(సరైనోడు)
ఉత్తమ నటి: అనసూయ భరద్వాజ్(క్షణం)
ఉత్తమ హాస్యనటుడు: ప్రియదర్శన్ (పెళ్లిచూపులు)
ఉత్తమ ప్రతినాయకుడు: జగపతిబాబు (నాన్నకు ప్రేమతో)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (జనతా గ్యారేజ్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సాగర్ (శైలజ శైలజ: నేను శైలజ)
ఉత్తమ నేపథ్య గాయకురాలు: రమ్య బెహర( రంగదే: అ ఆ)
ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (ప్రణామం: జనతా గ్యారేజ్)
తెలుగు చిత్ర పరిశ్రమలో 40 వసంతాలు పూర్తిచేసుకున్నందుకు స్పెషల్ అవార్డు: మోహన్‌బాబు
జీవిత సాఫల్య పురస్కారం: మురళీమోహన్

