మళ్ళీ ఈగో ప్రోబ్లేమే...!!

టాలీవుడ్ లో తమకు కావాల్సిన టెక్నీషియన్స్ నే ఏరి కోరి సెలెక్ట్ చేసుకుని మరీ సినిమాలు మొదలు పెడుతున్నారు... దర్శకనిర్మత హీరోలు. మరి అంత ఏరి కోరి తీసుకొచ్చిన వారితో చిన్న చిన్న విభేదాలే చిలికిచిలికి గాలి వానలా మారి వారు ఆ సినిమా నుండి బయటికి వెళ్లిపోతున్నారు. చిత్ర యూనిట్ లో ఎవరితో మనస్పర్థలు వచ్చినా కూడా ఆ టెక్నీషియన్స్ మారు మాట్లాడకుండా జంప్ అవుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యన టాలీవుడ్ లో విరివిగా జరుగుతున్నాయి. మరి టాప్ టెక్నీషియన్స్ తో ఒక్కోసారి అడ్జెస్ట్ కాలేక టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా వారితో విభేదాలు కొని తెచ్చుకుంటున్నారు.
ఇలాగే మొన్నామధ్యన 'జై లవ కుశ' నుండి కెమెరామన్ తప్పుకోగా అయన స్థానంలోకి వెంటనే మరో కెమెరామెన్ ని తెచ్చేసుకున్నారు. ఇక ఇపుడు తాజాగా నాని - వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఎంసిఎ' చిత్రానికి పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్ దివకర్ మణి ఆ చిత్రం నుండి బయటికి వచ్చేసినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో నిఖిల్ హీరోగా నటించిన 'కేశవ' సినిమాకు పనిచేసిన దివకర్ మణి ఇపుడు నాని సినిమాకు పనిచేస్తున్నాడు. డైరక్టర్ వేణు శ్రీరామ్ కు దినకర్ మణికి మధ్య తలెత్తిన విభేదాల వల్లనే దినకర్ మణి ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని టాక్ వినబడుతుంది.
ఇక ఇప్పుడు దినకర్ మణి ప్లేస్ లోకి మరో సినిమాటోగ్రాఫర్ ని వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇలా చిన్న విభేదాలు వలన ఎంతోమంచి టాప్ టెక్నీషియన్స్ సినిమాలనుండి బయటికి వెళ్లిపోతున్నారు. దీనంతటికి మెయిన్ కారణం దర్శకుల ఇగోలనే మాట బలంగా వినబడుతుంది.

