మల్టీ టాలెంట్ చూపిస్తున్నాడు

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ ట్రాక్ లో ఉన్నాడు. నాని ఏడాదికి దాదాపు నాలుగైదు సినిమాల్తో ఎప్పుడు బిజీ బిజీ గా ఉంటున్నాడు. ఆల్రెడీ ఈ ఏడాది 'నేనులోకల్, నిన్ను కోరి, వంటి హిట్స్ ని అందుకున్న నాని డిసెంబర్ లో 'మిడిల్ క్లాసు అబ్బాయి' అంటూ ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే MCA టీజర్ అందరిని ఆకట్టుకోగా... ఇప్పుడు MCA సాంగ్ బిట్ తో మరోసారి హల్చల్ చెయ్యబోతున్నాడు నాని. అయితే ఈ సినిమా పూర్తికాగానే... నాగార్జున తో కలిసి నాని ఒక మల్టీ స్టారర్ సినిమా ని కూడా ఓకే చేసాడు. ఈ మల్టీస్టారర్ కి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నాడు.
ఇకపోతే ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి హీరో అయినా నాని మధ్యలో నిర్మాత అవతారం కూడా ఎత్తాడు. తన ఫ్రెండ్స్ కోసం 'డి ఫర్ దోపిడీ' అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు నాని. ఆ సినిమా ఫలితం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ లో నాని ఒక చిన్న సినిమా ని ప్రొడ్యూస్ చేసాడట. నలుగురు హీరో హీరోయిన్స్ తో నాని ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా షూటింగ్ దాదాపు అయిపోయిందట. త్వరలో ఈ సినిమా టైటిల్ తో పాటే... ఫస్ట్ లుక్ పోస్టర్ ని అనౌన్స్ చేస్తుందట చిత్ర బృందం.
అయితే నాని నిర్మించిన ఈ సినిమాలో నటించిన హీరోలు హీరోయిన్లు అందరికి తెలిసిన వారేనట. త్వరలో ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా నాని పాల్గొంటాడని తెలుస్తుంది. మరి హీరో గా సక్సెస్ అయిన నాని ప్రొడ్యూసర్ గా సక్సెస్ అవుతాడా లేదా తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

