మరో హీరోయిన్ కూడా సినిమాలు వదిలేస్తుందా?

ఇప్పటికే టాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రిచా గంగోపాధ్యాయ సినిమాలకు స్వస్తి చెప్పి కొత్త జీవితంలోకి ప్రవేశించబోతున్నట్లుగా చెప్పి తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మరో భామ కూడా సినిమాలకు స్వస్తి చెబుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె ఎవరో కాదు 'చిన్నారి పెళ్లి కూతురు' అవికా గోర్. 'ఉయ్యాలా జంపాల' సినిమాతో హీరోయిన్ అవతారం ఎత్తి వరుస హిట్స్ అందుకున్న ఈ బొద్దుగుమ్మ గత కొన్ని రోజుల నుండి సినిమాలకు దూరంగానే ఉంటుంది.
అయితే మొన్నామధ్యన అవికాకు హీరోయిన్ అవకాశాలు రాకపోవడానికి టాలీవుడ్ లో ఒక హీరోయిన్ అని.. ఆ హీరోయిన్ దర్శక నిర్మాతలకు చెప్పి అవికా కు అవకాశాలు రాకుండా చేసిందనే ప్రచారం జరిగింది. ఇక అవికాకు అవకాశాలు రాకపోవడానికి నిజంగానే ఆ హీరోయిన్ కారణమనుకునే లా ఉందా ప్రచారం. మంచి హిట్స్ తో ఉన్న హీరోయిన్ ఒక్కసారిగా సినిమాలకు దూరమవడం వంటి విషయాలకు బలం చేకూరేలా ఆ ప్రచారం జరిగింది. అయితే అవికాకు నిజంగానే సినిమా అవకాశాలు తగ్గిపోవడం... అటు మాతృ భాష హిందీలో సైతం ఆమెకు హీరోయిన్ అవకాశాలు రాకపోవడంతో సినిమాలకి బై బై చెప్పేసి బుల్లితెర మీద సెటిల్ అవడానికి చూస్తుందట.
‘బాలికా వధు’(చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన అవికా గోర్ .. ఇప్పుడు ‘లాడా-2’ సీరియల్లో నటించేందుకు సిద్ధమైందట. మరి హిందీలో ఒక సీరియల్ స్టార్ట్ అయ్యింది అంటే ఆ సీరియల్ సంవత్సరాలు సంవత్సరాలు సాగుతుందనే విషయం తెలిసిందే. మరి అలా ఏళ్లకు ఏళ్ళు సీరియల్స్ లో నటించేస్తే ఇక హీరోయిన్ అవకాశాలు ఎవడికి కావాలి. అందుకే సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూసి నిరాశ చెందడం కన్నా తనకు అచ్చొచ్చిన బుల్లితెరనే నమ్ముకుని జీవితంలో స్థిరపడదామని అవికా ఫిక్సయిందట.

