మరో మల్టి స్టారర్ లో నాగ్?

టాలీవుడ్ లో ఈసారి పలు సినిమాలు సక్సెస్ బాటలోనే నడిచాయి. దాదాపు స్టార్ హీరోలు నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఈ ఏడాది చిరు కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150 ' విజకేతనం వేగురవేసిన టాలీవుడ్, నిన్న 'నేనే రాజు నేనే మంత్రి' వరకు మంచి హిట్స్ కొట్టడమే కాదు... 'బాహుబలి ద కంక్లూజన్' వంటి బిగ్గెస్ట్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. అయితే టాలీవుడ్ సంగతి ఇలా ఉంటే.... పక్కన కోలీవుడ్ పరిస్థితి మాత్రం ఏం బాగోలేదంటున్నారు నిపుణులు. ఈ ఏడాది తమిళంలో ఓ... అన్నంత హిట్స్ ఏం పడలేదు. స్టార్ హీరోలనుండి వచ్చిన సినిమాలు తక్కువే అయినా అందులో మాత్రం హిట్స్ చాలా తక్కువ.
మరి ఈ ఏడాది ప్రథమార్థం లో వచ్చిన సినిమాలన్నీ బోల్తాపడ్డప్పటికీ ఆర్ మాధవన్ - మాస్ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన ‘విక్రమ్ వేధ’ మాత్రం అంచనాలు మించి హిట్ అందుకుని తమిళనాట విజయకేతనం ఎగురవెయ్యడమే కాదు భారీ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. పుష్కర్ అండ్ గాయత్రీ కలిసి డైరెక్ట్ చేసిన ‘విక్రమ్ వేధ’ లో విజయ్ సేతుపతి ఒక గ్యాంగ్ స్టార్ గా నటిస్తే మరో హీరో మాధవన్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనబడి అదరగొట్టే నటనతో ఆకట్టుకున్నారు. మరి అంతగా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘విక్రమ్ వేధ’ చిత్రాన్ని మన టాలీవుడ్ వాళ్ళు వదులుతారా?
అయితే ఆ సినిమాని తెలుగులో వెంకటేష్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా.... రానా గ్యాంగ్ స్టర్ గా చెయ్యబోతున్నారంటూ మొన్నామధ్యన వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే... 'విక్రమ్ వేద' నిర్మాణ సంస్థ ఆ చిత్రాన్ని తెలుగులో నాగార్జున తో చెయ్యాలని భావించి... వారు నాగార్జున ను గ్యాంగ్ స్టర్ రోల్ కోసం అడిగినట్లు సమాచారం అందుతుంది. 'విక్రమ్ వేధ' నిర్మాత శశి కాంత్, నాగార్జున తో చర్చలు కూడా జరుపుతున్నట్టు చెబుతున్నారు. మరి ఒకవేళ నాగార్జున గ్యాంగ్ స్టర్ గా చెయ్యడానికి ఒప్పుకుంటే మరి పోలీస్ అధికారి పాత్ర ఎవరు చేస్తారనే ఆలోచనలో ఉన్న 'విక్రమ్ వేధ' నిర్మాతలు మళ్ళీ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కింద మాధవన్ అయితే బావుంటుందని అనుకుంటున్నారట.
మరి మాధవన్ తో నాగార్జున గనక స్క్రీన్ షేర్ చేసుకుంటే 'ఊపిరి' తర్వాత నాగార్జున మరోమారు తమిళ హీరోతో నటించబోతున్నాడన్నమాట. ఇక నిజంగా 'విక్రమ్ వేధ' సినిమా మేకింగ్ స్టైల్ గాని, స్క్రీన్ ప్లే గాని అన్ని కొత్తగా ఉండటంతో ఈ సినిమాను నాగ్ చేస్తే నిజంగా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. చూద్దాం ఫైనల్గా తెలుగు 'విక్రమ్ వేధ'కి ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో?

