మరో దివంగత ముఖ్యమంత్రి బైయోపిక్ ?

బాలీవుడ్ నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమకి బైయోపిక్ ట్రెండ్ బాగా పాకింది. ప్రస్తుతం తెలుగు లో మహానటి సావిత్రి గారి జీవితానికి వెండితెర రూపం గా 'మహానటి' చిత్రీకరణ దశలో ఉండగా, అతి త్వరలో నందమూరి తారక రామారావు, పుల్లెల గోపిచంద్ ల జీవిత కథలు సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయి. కాగా తెలుగు ప్రజలకి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారిలా తెలుగు ప్రజల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్న మరో దివంగత నేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి బైయోపిక్ కి ఏర్పాట్లు జరుగుతున్నట్టు వినికిడి.
గత ఏడాది చిన్న బడ్జెట్ చిత్రాలలో ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్న ఆనందో బ్రహ్మ చిత్ర దర్శకుడు మహి రాఘవ ఇప్పటికే రాజశేఖర రెడ్డి గారిపై బైయోపిక్ కి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారట. రెడ్డి గారి పాత్రని వెండితెరపై పోషించటానికి దర్శకుడు మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి కి ఇప్పటికే ప్రతిపాదన పంపారని తెలుస్తుంది. ఆయన నుంచి స్పందన వచ్చిన వెంటనే ఈ బైయోపిక్ పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. మరో వైపు ఈ స్క్రిప్ట్ ని ముందుగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కి నేరేట్ చేసి వివాద రహితంగా ఈ బైయోపిక్ ని తెరకెక్కించాలని ఆశిస్తున్నారట మహి రాఘవ.

