మరీ ఇంత ఫాస్టా...!!

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్ సినిమాలను చాలా స్పీడుగా తెరకెక్కించి విడుదల చేస్తాడనే పేరుంది. ఫాస్ట్ గా సినిమా తియ్యాలంటే పూరి తర్వాతే ఎవరైనా అని అందరూ ఢంకా భజాయించి చెబుతారు. ఇపుడు పూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' ని కూడా చాలా వేగంగా షూటింగ్ జరిపేస్తున్నాడు. బాలకృష్ణ 101 వ చిత్రం 'పైసా వసూల్' చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు పూరి. ఈ చిత్రం షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29 న విడుడల చేస్తున్నామని ఎప్పుడో ఎనౌన్స్ చేశారు.
మరి ఇప్పటివరకు హైదరాబాద్, పోర్చుగల్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రంలో బాలకృష్ణ గ్యాంగ్ స్టార్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా శ్రియ శరణ్, ముస్కాన్ లు నటిస్తుండగా... కైరా దత్ ఒక రోల్ చేస్తుంది. ఇక పోర్చుగల్ లో 40 రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్... దాదాపు 80 శాతం కంప్లీట్ అయినట్లే అనిచెబుతున్నారు. ఇక 'పైసా వసూల్' కోసం పూరి జగన్నాధ్, బాలయ్య మీద రైన్ ఫైట్ ఒకటి తీసాడని... ఆ రైన్ ఫైట్ 'పైసా వసూల్' చిత్రానికే హైలెట్ అంటున్నారు. ఇక మూడో షెడ్యూల్ తో ఈసినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని అంటున్నారు.
ఇక మూడో షెడ్యూల్ కూడా భారీ షెడ్యూలే అట. ఈ షెడ్యూల్ కూడా జులై 3 నుండి మొదలు పెట్టనున్నారట. ఈ షెడ్యూల్ ని కూడా జులై చివరినాటికి కంప్లీట్ చేస్తారని అంటున్నారు. మరి ఇంత ఫాస్ట్ గా సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్న పూరి సినిమాని కూడా ఆగస్టులోనే విడుదల చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదని అంటున్నారు. మరి సెప్టెంబర్ 29 న పైసా వసూల్ విడుదల అన్నారు... కానీ సినిమా మాత్రం ఆగష్టు నాటికే కంప్లీట్ అయ్యి విడుదలకు సిద్ధమవుతుందేమో అంటున్నారు.

