మరీ అంత గర్వమా?

నిన్న శుక్రవారం తమిళనాట టి రాజేందర్ ఒక హీరోయిన్ ని అవమానించడం అనే విషయం బాగా హైలెట్ అయ్యింది. హీరోయిన్ ధన్సిక చేసిన చిన్న పొరపాటుని రాజేందర్ పెద్దగా చూడడమే కాక అందరి ముందు ఆమెని అవమానించి నానామాటలు అన్నవిషయం సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ అయ్యింది. ఆఖరికి ధన్సిక, రాజేందర్ కాళ్ళు పట్టుకుని అందరిముంది క్షమాపణలు అడిగినా కూడా రాజేందర్ శాంతించలేదు. నానా మాటలతో ధన్సికని దుమ్మెత్తిపోసిన రాజేందర్ మీద తమిళ తంబీలు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి ధన్సికకు మద్దతు కూడా లభిస్తుంది.
ఈ విషయంపై తమిళ హీరో, నిర్మాతల మండలి అధ్యక్షుడు అయినా విశాల్ స్పందించాడు. టి రాజేందర్.. హీరోయిన్ ధన్సికను ప్రెస్ మీట్ జరిగిన స్టేజ్ మీదే టార్గెట్ చేయడం గురించి తెలిసింది. అసలు ధన్సిక క్షమాపణలు చెబుతున్నా రాజేందర్ పట్టించుకోలేదు. అసలు రాజేందర్ ఓ మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ అయి ఉండి కూడా ఒక స్టేజ్ మీద కేవలం పేరు చెప్పడం మర్చిపోయినందుకు ధన్సిక ఏకంగా ఆయన కాళ్ల మీద పడిపోయినా.. రాజేందర్ మాత్రం తన కూతురుతో సమానమైన వయసు గల ఆమెను క్షమించలేకపోయారు. ఫిలిం ఇండస్ట్రీలో ఒక మహిళ ఎదగడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఆమె ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేయలేదని మేము నమ్ముతున్నాం. అలాగే రాజేందర్ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆమె అప్పటికప్పుడే క్షమాపణలు చెప్పిన విషయాన్ని రాజేందర్ గుర్తించాలి... అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసాడు.
కేవలం ఒక్క విశాల్ మాత్రమే కాకుండా చాలామంది కోలీవుడ్ నటులు రాజేందర్ తీరును తప్పుపడుతున్నారు. అసలు చాలా చిన్న విషయానికి రాజేందర్ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమిటని... ఒక అమ్మాయి మీద ఆయన అంత ప్రతాపం చూపడం కరెక్ట్ కాదంటూ రాజేందర్ మీద విరుచుకు పడుతున్నారు.

