మరీ అంత ఆశా... నాని

కొత్త కథతో... కొత్త దర్శకుడితో... కొత్త నిర్మాత అయిన నాని చేసిన అద్భుతమైన కొత్త ప్రయత్నమే అ! సినిమా. గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా క్లాస్ ఆడియన్స్ ని మెప్పిస్తూ... యావరేజ్ టాక్ తో థియేటర్స్ లో పరుగులు పెడుతుంది. అయితే ఈ సినిమాకి నాని టాలీవుడ్ లోని టాప్ స్టార్స్ ని సెలక్ట్ చేసినప్పటికీ... వారికీ పెద్దగా పారితోషకాలేమి ఇచ్చుకోలేదు. అలాగే సినిమాకి కూడా భారీగా బడ్జెట్ కూడా పెట్టలేదు. అయితే సినిమాని వాల్ పోస్టర్ బ్యానర్ పై నిర్మించిన నాని చాలా చోట్ల ఓన్ గానే విడుదలచేసుకున్నాడు.
అలాగే తన సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందని నమ్మి ఇప్పటివరకు శాటిలైట్ హక్కులను అమ్మలేదు. ఒకవేళ అమ్మాలన్నా తనకి ఐదు కోట్లు ఇమ్మని కండిషన్ పెట్టాడట. మరి హీరోగా నాని సినిమాలకు బుల్లితెరమీద పిచ్చ క్రేజ్ అయితే ఉంది గాని... నిర్మాతగా అ! సినిమా మొదటి సినిమా ఆయే. కాజల్, రెజినా, నిత్యా మీనన్, శ్రీనివాస్ అవసరాల వంటి స్టార్స్ ఉంటే మాత్రం అందులో కంటెంట్ ఉండాలి. అయితే సినిమా కథ కొత్తగా ఉన్నప్పటికీ అది మాస్ ఆడియన్స్ ని... చదువులేని వారిని రీచ్ అవడం కష్టం గానే ఉంది. కేవలం క్లాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన ఈ సినిమాకి ఇప్పుడు శాటిలైట్ హక్కుల కోసం ఛానల్స్ ఏమాత్రం పోటీ పడడం లేదట. మరి సినిమాకి పెట్టుబడి... ఎంతో లేదు గాని శాటిలైట్ ద్వారా మరీ ఐదు కోట్లు రావాలని నాని కలలు కనడం కరెక్ట్ కాదేమో..
ఇక ఇప్పుడు శాటిలైట్ హక్కులను కనీసం ఒక కోటిన్నర వచ్చినా ఇచ్చేసి వదిలించుకునే పరిస్థితుల్లో నాని ఉన్నాడట. మరి ముందు బింకానికి పోయినా... ఇప్పుడు మాత్రం దిగొచ్చాడంటున్నారు. ఇకపోతే ఇండియాలో ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా ఓవర్సీస్ లో మాత్రం అ! సినిమా కి దుమ్ము దులిపే కలెక్షన్స్ వస్తున్నాయి. అక్కడనుండి అందుతున్న సమాచారం ప్రకారం అ! సినిమా అక్కడ దాదాపుగా 5 లక్షల 15 వేల డాలర్లు రాబట్టి మూడు రోజుల్లోనే అర మిలియన్ మార్క్ దాటేసి ఇంకాస్త స్పీడ్ తో శుక్రవారం నుంచి అదనపు స్క్రీన్లు జోడించుకుంటోంది అని అంటున్నారు...

