మరికొద్ది క్షణాల్లోనే తెలుస్తుంది?

జీఎస్టీ చిక్కుల్లో ఉన్న రామ్ గోపాల్ వర్మతో నాగ్ సినిమా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడా? అనే పెద్ద డౌట్ లో ప్రేక్షకులు కొట్టుమిట్టాడుతున్నారు. అసలు వర్మ కి నాగార్జున అవకాశం ఇవ్వడమే అందరిని ప్రస్తుతం ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న విషయం. అసలు ఏ హీరో కూడా రామ్ గోపాల్ వర్మ తో సినిమాలు చెయ్యడానికి జంకుతున్న టైం లోనే నాగార్జున, వర్మ కి ఛాన్స్ ఇచ్చాడు. అప్పట్లో శివ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వర్మకి ఇప్పుడు హిట్ ఇవ్వాలని నాగ్ ఈ అవకాశం ఇచ్చాడు. అయితే గత ఏడాది నవంబర్ లోనే సెట్స్ మీదకెళ్ళిన ఈ సినిమా ఏకధాటిగా 10 రోజుల్లో మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది.
ఇక రెండో షెడ్యూల్ కూడా ముంబై పరిసర ప్రాంతాల్లో మొదలవ్వడమే తరువాయి... అప్పుడే షూటింగ్ చివరిదశకు చేరుకుంది అని కూడా న్యూస్ వినబడుతుంది. అయితే నాగ్ - వర్మల సినిమాని ఈ ఏడాది వేసవికల్లా రెడీ చేసి విడుదల చేసే ప్లాన్ లో నాగ్ అండ్ వర్మ ఉన్నారనే టాక్ వినబడుతుంది. ఈ వార్తలకు ఇంతలా బలం చెక్కుర్చడానికి అసలు కారణం నాగ్ - వర్మలసినిమా ఫస్ట్ లుక్ ని ఈ రోజు అంటే ఆదివారం మధ్యాన్నం విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. మరి ఇప్పటివరకు టైటిల్ ని వదలకుండా సస్పెన్స్ క్రియేట్ చేసిన వీరు ఈ రోజు టైటిల్ తో సహా ఫస్ట్ లుక్ ని వదిలేస్తున్నారు.
మరి దీన్ని బట్టి చూస్తుంటే వర్మ నాగార్జున తో చేసే సినిమాని సిన్సియర్ గా సీరియస్ గా బాగానే తెరకెక్కిస్తున్నాడని అర్ధమవుతుంది. ఒక పక్క జీఎస్టీ కేసులో ఉన్న వర్మ నాగ్ సినిమా మీద మనసెలా పెట్టి తీస్తున్నాడా అనే కంగారు అక్కినేని అభిమానుల మనస్సులో ఉంది. రామ్ గోపాల్ వర్మ స్వయంగా డైరెక్ట్ చేస్తూ తన కంపెనీ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో కానీ... సినిమా పూర్తయ్యి విడుదలయ్యేవరకు మాత్రం ఫుల్ సస్పెన్స్ కొనసాగేలాగే కనబడుతుంది. చూద్దాం ఈ రోజు సాయంత్రంకల్లా తెలుస్తుంది... నాగ్ - ఆర్జీవీ సినిమా విడుదల డేట్ అండ్ టైటిల్.

