మనోడి సుడి మాములుగా లేదు!!

ఒక సినిమా హిట్ అయ్యింది అంటే ఆ సినిమాలో నటించే నటీనటులు ఆ తర్వాతి సినిమాలో తమ పారితోషకాన్ని అమాంతం పెంచేసే నటీనటులను కోకోల్లలుగా చూస్తూనే ఉన్నాం. సినిమా రంగంలో దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి అన్న చందం గా చాలామంది ఇలానే తయారవుతున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి హీరో విజయ్ దేవరకొండ కూడా చేయిపోయాడంటున్నారు. పెళ్లి చూపులతో డీసెంట్ హిట్ కొట్టి ద్వారకాతో బేర్ మన్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో అనూహ్యంగా స్టార్ అయ్యాడు. అర్జున్ రెడ్డి చిత్రం ఇచ్చిన విజయం మామూలుది కాదు. ఈ హిట్ తో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.
రెండు కోట్లా?
అర్జున్ రెడ్డి లో విజయ్ చేసిన నటనకు ఫిదా అయిన దర్శక నిర్మాతలు విజయ్ కి ఉన్న క్రేజ్ తో సినిమా చేసి హిట్ కొట్టేయాలని చూడడమే కాదు విజయ్ దేవరకొండ ఇంటిముందు పడిగాపులు కాస్తున్నారు. మరి దర్శక నిర్మాతల దగ్గర తన డిమాండ్ చూసి విజయ్ కూడా డిమాండ్ కి తగ్గ క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో అర్జున్ రెడ్డికి ముందు కోటి తో సరిపెట్టిన ఈ హీరో అర్జున్ రెడ్డి తర్వాత కోటికి కోటి అంటే రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలకు కూడా మరో కోటి అదనంగా ఇవ్వాలనే కండిషన్ కూడా పెడుతున్నాడట.
నాలుగు ప్రాజెక్టులు.....
మరి ప్రస్తుతం విజయ్ చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయట. ఆ ప్రాజెక్టులన్నీ అర్జున్ రెడ్డి విడుదల కాకముందు కమిట్ అయినవే నట. మరి అప్పుడు కోటి పారితోషకం కాబట్టి నిర్మాతలు అతనిని బుక్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అర్జున్ రెడ్డి అనూహ్య విజయంతో విజయ్ పారితోషకం డబుల్ పెరిగినా విజయ్ కున్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో కోటి ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారట. అదండీ విజయ్ సుడి అంటే..!
- Tags
- విజయ్ దేవర కొండ

