మగధీర తరువాత ఖైదీ నెం. 150

సుప్రీమ్ హీరో నుంచి మెగా స్టార్ అయ్యి రెండు దశాబ్దాలు అగ్ర స్థానంలో తెలుగు చిత్ర పరిశ్రమలో చక్రం తిప్పిన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్తూ తన నట వారసుడిగా చిరుత తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ని వెండి తెర కు పరిచయం చేశారు. చరణ్ తొలి చిత్రం చిరుత, మెగా స్టార్ తొలి ఇన్నింగ్స్ లో ఆఖరి చిత్రం శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలు ఒకే ఏడాది విడుదల అయ్యాయి. ఆ చిత్రం తరువాత పూర్తిగా రాజకీయాలకు పరిమితమైన చిరంజీవి చెర్రీ రెండవ చిత్రం మగధీర లో తన పాట బంగారు కోడి పెట్ట రీమిక్స్ లో చరన్తో పాటు స్టెప్పులేసి ప్రేక్షకులను అమితానందానికి గురి చేశారు ఈ తండ్రీ కొడుకులు.
చిరు సినిమాల్లోకి రీఎంట్రీ ప్రకటన జరిగిన తరువాత ఆయన బ్రూస్ లీ చిత్రం లో అతిధి పాత్రలో చెర్రీ తో కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించినప్పటికీ ఇద్దరు కలిసి స్టెప్పులు వేసిన సందర్భం ఆ చిత్రంలో లేదు. చిరు హీరోగా రీఎంట్రీ మూవీ కథా చర్చలు జోరుగా సాగుతున్న రోజులలో తండ్రీ కొడుకులు కలిసి మల్టీ స్టారర్ చేసే ఉద్దేశంతో కథలు వింటున్నారని ప్రచారం సాగింది. కానీ చిరు 150 వ చిత్రం అధికార ప్రకటన వెలువడిన తరువాత ఆ వార్తలకు కాలం చెల్లిపోయింది. కానీ నిర్మాతగా చెర్రీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఓనర్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఖైదీ నెం.150 టీజర్ లో చిరు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుండటంతో పాటు చెర్రీ ఒక పాటలో చిరుతో కలిసి చిందేయనున్నాడని తెలిసి మెగా అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.
తాజాగా చెర్రీ ఖైదీ నెం.150 చిత్రంలో తాను కనిపించే పాటలోని తన భాగం చిత్రీకరణ పూర్తి చేసాడు. చెర్రీ స్టెప్ వేసింది ఒక బాక్గ్రౌండ్ బీట్ కి అని, లిరిక్ ఏది ఉండదు అని సమాచారం. ఆ పాటలో చెర్రీ లుక్ కూడా ప్రేక్షకులకు కన్నుల పంటగా మిగిలిపోనుంది.

