మగధీర కి సీక్వెలా?

రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలంలో నటించడంతో పాటే... తన తండ్రి చిరంజీవి సై రా నరసింహారెడ్డి సినిమాని నిర్మిస్తూ బిజీగా వున్నాడు. మరోపక్క రంగస్థలం విడుదల కాకముందే మరో డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ఒక ప్రాజెక్ట్ కమిట్ అవడమేకాదు... వచ్చే నెల నుండి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతుంది. బోయపాటి - రామ్ చరణ్ ల సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకెళుతున్న సమయంలో ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.
అదేమిటంటే.. రామ్ చరణ్ ఈ సినిమాలో యువరాజుగా నటించబోతున్నాడట. చరణ్ ఈ సినిమాలో రాజవంశస్థుడిగా కనిపించనున్నాడని... అంటే యువ రాజుగా కొంతసేపు అలరిస్తాడని ఇన్సైడ్ టాక్. అందుకోసమే ఈ సినిమా ఎక్కువ శాతం రాజస్థాన్లో చిత్రీకరించనున్నారట. రాజస్థాన్ లోని రాజ్మహల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అలాగే రాజస్థాన్, రామోజీ ఫిల్మ్ సిటీల్లో ఈ సినిమాకి సంబందించిన 70శాతం చిత్రీకరణ జరగనుంది. ఇక మిగిలిన 30 శాతం బయట ప్రాంతాల్లో షూట్ చేయనున్నట్లు గా సమాచారం అందుతుంది.
మరి పక్కా మాస్ చిత్రాలను తెరకెక్కించే బోయపాటి శీను ఈ లెక్కన రామ్ చరణ్ తో మగధీర సీక్వెల్ తియ్యడం లేదు కదా అంటూ మెగా ఫాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అను ఇమ్మాన్యువల్ నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. రమ్య కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాని డి వి వి దానయ్య నిర్మిస్తున్నాడు

