మంచి శిక్షణతోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడట

మెగా ఫ్యామిలీ లో హీరోలు పుట్టలు పుట్టలు కింద పుడుతూనే ఉన్నారు. కోకోల్లలుగా మెగా ఫ్యామిలీ హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేస్తున్నారు. ముందుగా చిరంజీవి సినిమా పరిశ్రమలో మొక్కనాటితే అది వట వృక్షమై ఇప్పుడు దానికి అనుకుని బోలెడన్ని వేర్లు పుట్టుకొచ్చాయి. చిరు, నాగ బాబు, పవన్, చరణ్, అల్లు అర్జున్, శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలోకి వచ్చినవారే. అయితే ఇప్పుడు చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే న్యూస్ గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ్రీజ ని పెళ్లి చేసుకున్న కళ్యాణ్ కి ఉన్న అందం కారణంగా అతను అప్పుడే సినిమాల్లోకి వస్తాడనే ప్రచారం జోరుగా జరిగింది.
అయితే ఆ వార్తలను ఏమాత్రం ఖండించకుండా మెగా ఫ్యామిలీ సైలెంట్ గా ఉండిపోయింది. ఇక ఇప్పుడు కళ్యాణ్ సినీరంగ ఎంట్రీ దాదాపు ఖాయమంటున్నారు. కళ్యాణ్ సినిమారంగ ప్రవేశంకి సంబందించిన పనులు వేగంగా జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే నటనలో శిక్షణ కూడా ఇప్పిస్తున్నాడట చిరంజీవి. అల్లుడు కళ్యాణ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి సినిమా ఇండియాట్రిలో పాతుకుపోయేలా చెయ్యాలని చిరు భావిస్తున్నాడట. అందుకే డాన్స్ లలో, నటనలో కళ్యాణ్ శిక్షణ తీసుకుంటున్నాడని... పవన్ కల్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్, రవితేజ, జయంరవి, వరుణ్ తేజలకు ట్రైనింగ్ ఇచ్చిన సత్యానంద్ వద్దే మూడునెలలపాటు కల్యాణ్ నటనలో శిక్షణ తీసుకున్నాడని అంటున్నారు.
ఇక శిక్షణ పూర్తి చేసుకున్న కళ్యాణ్ ప్రస్తుతానికి తన మామ చిరు ఆధ్వర్యంలో మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాడట. మంచి కథతో పాటే మంచి దర్శకుడిని ఫైనల్ చేసుకుని కళ్యాణ్ గ్రాండ్ గా తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తాడనే హాట్ టాపిక్ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇక కళ్యాణ్ సినిమా ఎంట్రీని కూడా ఒక మంచి రోజు చూసుకుని అధికారికంగా ప్రకటించే యోచనలో మెగా ఫ్యామిలీ ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి.

