మంచి చెబితే చెడు ఎదురొస్తుందంట!!

టాలీవుడ్ లో కొంతమంది దర్శకులు చాలా స్ట్రయిట్ ఫార్వార్డ్ గా ఉంటారు. తాము ఏది చెప్పాలన్నా మొహం మీదె చెప్పేస్తారు. అలాంటి వారిలో రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాధ్, కృష్ణ వంశి వంటి డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు కృష్ణ వంశి కూడా తన తాజా ప్రాజెక్ట్ నక్షత్రాన్ని విడుదలకు సిద్ధం చేసాడు. అయితే ఇండస్ట్రీలో కృష్ణ వంశీకి తల పొగరు అంటారు చాలామంది. కృష్ణ వంశీతో పనిచెయ్యడంఅంటే చాలా కష్టమనే అభిప్రాయాన్ని కొంతమంది ప్రత్యక్షంగా చెబితే మరికొంతమంది పరోక్షముగా చెబుతుంటారు.
అయితే ఒక ఇంటర్వ్యూ లో కృష్ణ వంశీని మీతో పనిచెయ్యడం చాల కష్టం అని చాలామంది అంటుంటారు. దీనికి మీ సమాధానం ఏమిటంటూ అడగగా... దానికి కృష్ణ వంశి నాతో పని చేసిన వారిలో చాలా తక్కువమంది నన్ను తిట్టుకుంటుంటారు. అది వారి ఖర్మ. కానీ ఎక్కువ శాతం మంది మాత్రం నా దగ్గర చాలా నేర్చుకున్నామని గర్వంగా చెబుతుంటారు. ఒక హీరో ఉన్నాడు అనుకోండి.... అతడికి మతిమరుపు ఎక్కువ, రెండు డైలాగుల కంటే ఎక్కువ గుర్తు పెట్టుకోలేదు. అలాగే ఆ పాత్రను కూడా సరిగ్గా ఆకళింపు చేసుకోలేడు. అలా కాదు హీరోగారు ఇలా చెయ్యాలి అని చెబితే అతనికి కోపం వచ్చేస్తుంది. అలాగే బయటికెళ్లి కృష్ణ వంశి అలాంటోడు ఇలాంటోడు అంటూ రకరకాలుగా నా మీద ప్రచారం చేస్తారు.
అయితే ఈ వ్యాఖ్యలను కృష్ణ వంశి ఎవరిని ఉద్దేశించి అన్నాడో అంటూ అప్పుడే హాట్ హాట్ చర్చకు తెరలేపారు సోషల్ మీడియా అభిమానులు. ఇకపోతే చరణ్ తో చేసిన గోవిందుడు ప్లాప్ అవడం తనకి కొంచెం బాధ కలిగించిందని.... కానీ చరణ్ కి జీవిత కాలం గుర్తుండిపోయే ఒక సినిమాని మాత్రం కానుకగా ఇస్తానని చెబుతున్నాడు. మరి కృష్ణ వంశి అయితే చరణ్ తో సినిమా చేస్తానంటున్నాడు గాని చరణ్ ఈయనగారితో చెయ్యడానికి సిద్దపడాలిగా....

