భారీ బడ్జెట్ సినిమాలో భారీ తారాగణం

ప్రభాస్ హీరోగా సాహో మొదలు పెట్టినప్పటినుండి ఆ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించే సినిమా కావడం.. రన్ రాజా రన్ తో హిట్ కొట్టిన దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో ఈ సాహో తెరకెక్కడం, అలాగే ఈసినిమాని ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండడం, అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ నటులు ఎక్కువమందికి చోటివ్వడంవంటి ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ సాహో మీద ప్రేక్షకులకు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఆ అంచనాలను అందుకోవడానికి సాహో చిత్ర టీమ్ కూడా శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. బాహుబలిలా జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించాలంటే ఈ సినిమాకి అన్ని విధాలా ప్రత్యేక పబ్లిసిటీ చెయ్యడం.. అలాగే ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే విధంగా జాతీయ స్థాయి అవుట్ ఫుట్ ఇవ్వడం వంటి అంశాలపై సాహో టీమ్ దృష్టి సారించింది.
ఇకపోతే ఈచిత్రంలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ ని తీసుకున్న టీమ్ ఇప్పుడు మరో ముఖ్య పాత్ర కోసం మరొక బాలీవుడ్ నటి మందిరా బేడీని కూడా తీసుకుంటున్నట్లుగా ప్రచారం మొదలైంది. ఇప్పటికే సాహో కి క్రేజ్ తెచ్చే పనిలో బాలీవుడ్ నటులకు ఎక్కువగా ఓటేసిన సాహో టీమ్ ఎక్కువగా బాలీవుడ్ నటులనే దింపుతోంది. ఇప్పటికే సాహో చిత్ర విలన్స్ కోసం నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, టిన్ను ఆనంద్ వంటి వాళ్ళని తీసుకున్న చిత్ర టీమ్ ఇప్పుడు మరో బాలీవుడ్ నటి మందిరా ని కూడా విలన్ పాత్రకే ఎంపిక చేసిందనే న్యూస్ వైరల్ అయ్యింది.
మరి మందిర బేడీ సాహో లో నటిస్తుంది అనే విషయాన్ని చిత్ర యూనిట్ ఎక్కడా ధ్రువీకరించలేదు. ఇకపోతే మందిరా బేడీ పెళ్ళై పిల్లలున్న కూడా తన ఫిజిక్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చెయ్యడమే కాదు ఫిట్ నెస్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంది. అలాగే ఈ వయసులోనూ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంటుంది. మరి సాహోలో ప్రతిపక్ష పాత్రని మందిరా ఎలా హ్యాండిల్ చేయనుందో చూద్దాం.

