భలే సమస్యలో ఇరుక్కున్నాడు.. పాపం!

టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా బిజీ అయిపోయాడు హీరో రాజా తరుణ్. వరస పెట్టి సినిమాలు మీద సినిమాలు తీసుకుంటూ పోతున్నాడు. 'ఉయ్యాలా జంపాల' తో తెలుగు ప్రేక్షకులు దగ్గర అయ్యాడు. మొదటి సినిమా నుండి 'కుమారి 21 ఎఫ్' వరకు మంచి హిట్స్ సాధించాడు. అయితే ఈ మధ్య వచ్చిన సినిమాలు అంతగా ఆడకపోయినకాని సినిమా ఆఫర్స్ వస్తూనే వున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాణంలో 'రాజు గాడు' అనే సినిమాను చేస్తున్నాడు రాజ్ తరుణ్. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ లో 'రంగుల రాట్నం' అనే సినిమాలో నటిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా రాజా తరుణ్ కి ఈ రెండు సినిమాల వల్ల ఓ సమస్య వచ్చిందంట. ప్రస్తుతంలో ఏ హీరోకి బహుశా ఇలాంటి సమస్య వచ్చిఉండకపోవొచ్చు. అసలు విషయం ఏంటంటే.. మొదట 'రాజుగాడు' నిర్మాతలు ఈ సినిమాని సంక్రాంతి కి రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. అయితే తెలిసి చేసిందో తెలియక చేసిందో గాని అన్నపూర్ణ స్టూడియోస్ వారు కూడా రాజ్ తరుణ్ 'రంగుల రాట్నం' సినిమాను అదే డేట్ కి రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు.
అయితే ఈ రెండు సినిమాల్లో రాజ్ తరుణ్ హీరో కాబట్టి.... ఏం మాట్లాడకలేపోతున్నాడంట. నిర్మాతలు తెలిసి చేస్తున్నారో.... లేక తెలియక చేస్తున్నారో కానీ ఈ రెండు సినిమాలు సంక్రాంతి రిలీజ్ అయ్యే అవకాశం వుంది. . అప్పట్లో బాలకృష్ణ ( నిప్పు రవ్వ - బంగారు బుల్లోడు ).... అలాగే నాని (ఎవడే సుబ్రహ్మణ్యం - జెండా పై కపిరాజు ) సినిమాలు ఒకే సారి రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా అదే అనుభవాన్ని ఎదుర్కోబోతున్నాడు. చూద్దాం.. చివరకు రాజ్ తరుణ్ పరిస్థితి ఏమవుతుందో!.. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే కలెక్షన్స్ అంతంత మాత్రంగా వచ్చే అవకాశం వుంది.

