భలే బిల్డప్ ఇస్తున్నాడు!!

సల్మాన్ తాజా చిత్రం 'ట్యూబ్ లైట్’ బాక్సాఫీసు దగ్గర బోల్తాపడింది. ఏమో బాహుబలి రికార్డులను కొట్టేస్తుందేమో అని ప్రగల్బాలు పలికిన సల్మాన్ కి ఇప్పుడు 'ట్యూబ్ లైట్’ తో గట్టిగా దెబ్బపడింది. బాలీవుడ్ క్రిటిక్స్ అంతా కట్టగట్టుకుని సల్మాన్ కి సింగిల్ రేటింగ్ ఇచ్చారు. ఇంతకుముందు 'సుల్తాన్, భజరంగి భాయిజాన్' చిత్రాల హిట్స్ వలే 'ట్యూబ్ లైట్’ కూడా హిట్ కొడుతుందని సల్మాన్ బాగా ఆశపడ్డాడు. అందుకే బాహుబలిపై అలాంటి వ్యాఖ్యలు చేసాడు. అసలు సినిమా విడుదలకు ముందే వెబ్ మీడియాలో వచ్చే రివ్యూలు.. రేటింగ్స్ విషయంలో విమర్శలు చేసాడు.
మరి క్రిటిక్స్ ని అంతలా తప్పుబట్టిన సల్మాన్ ఇప్పుడు తన సినిమాకి వచ్చిన రేటింగ్స్ తో తెల్లమొహం వేసాడని అంటున్నారు. ఇక ఎప్పుడూ రంజాన్ పండగని క్యాష్ చేసుకునే సల్మాన్ ఈసారి రంజాన్ కి మాత్రం గుడ్లు తేలేసాడనే కామెంట్స్ పడుతున్నాయి. అయితే ఇప్పుడు తన సినిమాలకు 1 , 1.5 రేటింగ్స్ రావడంపై సల్మాన్ భలేగా స్పందించాడండోయ్. క్రిటిక్స్ చాలా ఉదారంగా వ్యవహరించి రేటింగ్స్ ఇచ్చారని... నిజానికి తాను - 3, - 4 రేటింగులు వస్తాయనుకున్నానని.. కానీ 1 ,1.5 రేటింగ్స్ ని ఊహించలేదని బిల్డప్ ఇస్తున్నాడు.
ఇక 'ట్యూబ్ లైట్’ ఫిల్మ్ ఇంత నెగెటివ్ టాక్ తో కలెక్షన్స్ కొల్లగొట్టడం అనేది కల్లే.. కాకపోతే రంజాన్ సెలవులు దృష్టిలో ఉంచుకుని కొన్ని కలెక్షన్స్ అయితే రాబడుతుందిగాని.... గత సినిమాల కలెక్షన్స్ చేరుకోవడం మాత్రం 'ట్యూబ్ లైట్’ కి సాధ్యమయ్యే పనికాదంటున్నారు

