భలే ఉన్నాడుగా

టాలీవుడ్ లో, కోలీవుడ్ లో, బాలీవుడ్ లో ఏ వుడ్ లో అయినా హీరోలు అమ్మాయిలా గెటప్ లు వేసుకుని చాలా సినిమాల్లోనే కనబడ్డారు. కోలీవుడ్ లో అయితే విక్రమ్ 'మల్లన్న' సినిమాలో చీర కట్టి కత్తిలా కనబడ్డాడు. అలాగే తెలుగులో కూడా రాజేంద్ర ప్రసాద్ వంటి కామెడీ హీరో 'మేడం' సినిమాలో అయితే సినిమా మొత్తం అమ్మాయి గెటప్ లోనే ఉండి అదరగొట్టాడు. ఇక మొన్నటికి మొన్న కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ 'రెమో' సినిమాలో... సినిమా మొత్తం నర్స్ గెటప్ అంటే లేడీ గెటప్ లో ఇరగదీసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ హీరోల లిస్ట్ లోకి మరో హీరో చేరిపోయాడు. అతనెవరంటే కోలీవుడ్ లో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా ఇలాంటి ఒక లేడీ గెటప్ నే ట్రై చేస్తున్నాడు. 'సూపర్ డీలక్స్' అనే సినిమాలో విజయ్ సేతుపతి సినిమా మొత్తం అమ్మాయి గెటప్ లోనే కనిపించబోతున్నాడట. తాజాగా 'సూపర్' డీలక్స్ సినిమా ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. 'సూపర్ డీలక్స్' లో విజయ్ సేతుపతి అమ్మాయి పాత్ర పేరు శిల్ప అనే విషయం చిత్ర బృందం రివీల్ చేసింది.
ఇక ఈ 'సూపర్ డీలక్స్' ఫస్ట్ లుక్ లో విజయ్ సేతుపతి శిల్పగా భలేగా కనబడుతున్నాడు. ఎరుపు రంగు చీరలో... అందమైన బొట్టుపెట్టుకుని సాంప్రదాయబద్ధంగా.... అసలు అచ్చు అమ్మాయి మాదిరిగానే కనిపిస్తున్నాడు విజయ్ సేతుపతి. మరి ఒక మాస్ హీరో ఇలా అమ్మాయి గెటప్ లో ఒదిగిపోవడం సామాన్యమైన విషయం కాదు. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే విజయ్ సేతుపతి చిరంజీవి 151 సినిమా 'సై రా' లో ఒక కీలక పాత్రకి ఎంపికైన విషయం తెలిసిందే.


