బ్రహ్మానందం ఇంత మంచివాడా?

దశాబ్దాల కాలంగా బ్రహ్మానందం అగ్ర హాస్య నటుడి స్థాన్నాన్ని అనుభవించి ఇటీవల ఇతర సీనియర్ నటులు, యువ నటుల హవా పెరగటంతో పోటీలో వెనుకంజలోకి వెళ్లిపోయారు. గతంలో పలు సందర్భాల్లో బ్రహ్మానందం ఎం చెయ్యవసరంలేదు, కనిపెడితే చాలు నవ్వుతూనే వుంటాను అని చెప్పిన దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా బ్రహ్మానందం కోసం తన గత చిత్రం అఆ చిత్రంలో పాత్రను రాయకపోవటం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బ్రహ్మి పరిస్థితి అర్ధం అవుతుంది. శ్రీనివాస్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ రాజ్, ప్రభాస్ శ్రీను, వెన్నెల కిషోర్ వంటి పలువురు హాస్య నటులు ఇప్పుడు జోరుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులు బ్రహ్మీని మర్చిపోయేలా చేశారు.
తాజాగా విడుదలై విజయం పొందిన జయమ్ము నిశ్చయమ్ము చిత్రంలో బ్రహ్మి పలికించే పలు హావభావాలను చిత్రంలోని పాత్రలు మెసెజ్‌ల ద్వారా పంచుకుంటుంటాయి. దర్శకుడికి ఈ ఆలోచన వచ్చినప్పుడు శ్రీనివాస్ రెడ్డికి చెప్తే శ్రీనివాస్ రెడ్డి స్వయంగా బ్రాహ్మితో మాట్లాడి అనుమతి తీసుకున్నాడు అంట. ఈ విషయమై శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, "బ్రహ్మానందం గారి హావభావాలను వాడుకుని కథలో పాత్రలు సంభాషించుకోవటం కోసం అనుమతి పొందటానికి ఆయనకు ఫోన్ చేశా. ఆయన మా ఆలోచనకు సమ్మతిస్తూనే, బొమ్మ వాడుకోవటం ఎందుకు అవసరమైతే తానే వచ్చి ఫ్రీ గా పాత్ర చేస్తానని అన్నారు. మేమే ఆయనను భరించే అంత పెద్ద చిత్రం కాదు అని తిరస్కరించాము. చిత్రం పూర్తి అయిపోయిన తరువాత టైటిల్ కార్డులో స్పెషల్ థాంక్స్ వేస్తాము అని తెలిపితే దానికి కూడా బ్రహ్మానందం గారు ఒప్పుకోలేదు." అని బ్రహ్మానందం గొప్పతనాన్ని ఆపకుండా పొగడ్తలతో ముంచేశాడు కమెడియన్ టర్న్డ్ హీరో శ్రీనివాస్ రెడ్డి.

