బిచ్చగాడు + లూసీ = భేతాళుడు

ఈ ఏడాది అనువాద చిత్రాలలో భారీ విజయం పొందిన చిత్రం బిచ్చగాడు. స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి ఈ కాలం లో సాధ్యపడని 100 రోజుల కేంద్రాలను సాధించింది బిచ్చగాడు చిత్రం. ఆ చిత్రంతో హీరో కం సంగీత దర్శకుడు విజయ్ ఆంథోనీ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువవటంతో ఆయనే స్వయంగా నిర్మించి నటించిన బేతాళుడు చిత్రం తెలుగు రాష్ట్రాలలో 500 కు పైగా థియేటర్లలో విడుదల ఐయ్యింది. తొలి రోజు మిక్స్ డ్ టాక్ తో ఓపెన్ అయిన ఈ చిత్రం - ద్వితీయార్ధంలో ఇబ్బంది పెట్టే కథనంతో కొంత ప్రేక్షకుడికి విసుగు తెప్పించింది కానీ చిత్ర కథాంశం మాత్రం అందరి మెప్పు పొందుతుంది. అయితే ఈ కథాంశం గురించే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
శరీరంలోకి ఒక ఔషధ ద్రవం ఎక్కించిన కారణాన కొన్ని జన్మలు వెనక్కి మానసిక స్థితి చేరి మెంటల్‌గా జన్మల వరకు టైం ట్రావెల్ జరిగే కథాంశంతో తెరకెక్కిన ఆంగ్ల చిత్రం లూసీ! పది మిలియన్ డాల్లర్లతో నిర్మితమై దాదాపు 430 మిల్లియన్ డాల్లర్లు వసూలు చేసింది. నిన్న(గురువారం) విడుదలైన విజయ్ ఆంథోనీ చిత్రం బేతాళుడు ఇదే కథాంశంతో తెరకెక్కింది. అయితే మన ప్రేక్షకుల అభిరుచికి తగట్టు రివెంజ్ డ్రామా కథనం జోడించి గత జన్మ పరిణామాలను ప్రస్తుత జన్మ హీరో పాత్రకు అన్వయించారు. లూసీ చిత్రం చూసిన ప్రేక్షకులు అందరికి బేతాళుడు ప్రథమార్ధం అసంతృప్తి కలిగిస్తే ఆశ్చర్యం లేదు.

