బిగ్ హౌస్ లోకి అడుగుపెడుతున్న హీరోయిన్స్

ఎన్టీఆర్ బుల్లితెర మీద హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందులోను ఎన్టీఆర్ ఎనర్జీ, పెరఫార్మెన్స్, అల్లరితో బిగ్ బాస్ షోని రక్తి కట్టిస్తున్నాడు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఏ హీరో సినిమాలు విడుదలవుతున్న వారు ఎన్టీఆర్ బిగ్ బాస్ లోకి వచ్చి అందులోని కంటెస్టెంట్స్ తో సరదాగా ఎంజాయ్ చేస్తూ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. అలా 'నేనే రాజు నేనే మంత్రి' హీరో రానాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా వస్తున్న 'జై లవ కుశ' హీరోయిన్స్ రాశి ఖన్నా, నివేత థామస్ వరకు కొనసాగుతూ వస్తుంది అంటున్నారు.
ఇక బిగ్ బాస్ షో మరో వారంరోజుల్లో పూర్తి కాబోతుంది. అలాగే 'జై లవ కుశ' చిత్రం కూడా మరో ఐదు రోజుల్లో విడుదల కాబోతుంది. ఇక 'జై లవ కుశ' హీరో, బిగ్ బాస్ హోస్ట్ ఎన్టీఆర్ కాబట్టి అక్కడికి అంటే బిగ్ బాస్ స్టేజ్ మీద ఎన్టీఆర్ 'జై లవ కుశ' ప్రమోషన్ కి ప్రత్యేకించి వెళ్లాల్సిన పని లేదు. అందుకే ఇప్పుడు 'జై లవ కుశ' హీరోయిన్స్ రాశి ఖన్నా, నివేత థామస్ లు బిగ్ బాస్ హౌస్ కి అథిధులుగా రావడమే కాదు 'జై లవ కుశ' ప్రమోషన్ నికూడా గట్టిగా చెయ్యనున్నారు. అయితే వీరిద్దరూ ఈరోజు శనివారమే బిగ్ బాస్ హౌస్ కి వెళుతున్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే శని, ఆది వారాల్లో ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్ స్టేజ్ మీదుంటాడు కాబట్టి ఈ ఇద్దరు హీరోయిన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారట. మరి 'జై లవ కుశ' సెప్టెంబర్ 21 న విడుదల సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్స్ పీక్ లోకి వెళ్ళబోతున్నాయి. అందులో భాగంగానే 'జై లవ కుశ' హీరోయిన్స్ ఇలా బిగ్ హౌస్ లోకి వెళ్లి తెలుగు ప్రేక్షకులకు ఇంటింటా దగ్గరవడానికి రెడీ అవుతున్నారన్నమాట. అలాగే ఎన్టీఆర్, రాశి ఖన్నా, నోవేధ థామస్ ల అల్లరి ఈ రోజు బిగ్ బాస్ షోని ఎక్కడికో తీసుకెళ్లనుందన్నమాట.

