బికినీలో అందాల లావణ్యం చూస్తారా...

అందాల రాక్షసి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠికి 2017 పెద్దగా కలిసి రాలేదు. ఈ సంవత్సరంలో ఆమెకు హిట్ లేదు సరికదా...యావరేజ్ సినిమా కూడా లేదు. రామ్‌తో చేసిన ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా బిలో యావరేజ్. ఆ సినిమాతో లావణ్య కంటే అనుపమకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక నాగచైతన్యతో చేసిన యుద్ధం శరణం అయితే ఘోరమైన డిజాస్టర్.
కుర్ర హీరోయిన్లు అయిన అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్, అనూ ఎమ్మాన్యుయేల్, సాయి పల్లవి లాంటి వారి నుంచి తీవ్రమైన పోటీ ఉండడంతో ఆమె మంచి ఛాన్సులు అందుకోవడంలో కూడా వెనకపడిపోతోంది. ఇలా అయితే లాభం లేదనుకుందో ఏమోగాని ఆమె గ్లామర్ డోస్ పెంచేసింది. అందాల ఆరబోతకు గేట్లు ఎత్తేసింది. తాజాగా హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న లావణ్య బికినీ స్టిల్ ఒకటి ఇచ్చిన దానిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

లావణ్య బికినీ స్టిల్ అంటే మన కుర్రోళ్లు ఊరుకుంటారా ? దానిని పదే పదే షేర్లు చేస్తూ పదే పదే చూసి ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఆమె అందాల లావణ్య రాశి అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా..! అయితే ఆ బికినీ స్టిల్‌లో ఆమె చిన్న ట్విస్ట్ ఇచ్చింది. ఆ ఫొటో వెనక నుంచి తీసింది. ఆమె బీచ్ ఒడ్డున కూర్చుని సముద్రంలో ఉదయిస్తున్నట్టు ఉన్న సూర్యుడిని చూస్తూ ఉంది.
ఆమె అందం బ్యాక్లెస్లో చూస్తూనే తనివితీరడం లేదు..ఇక ఫ్రంట్ నుంచి చూస్తే మైమరచి పోవాల్సిందే అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల సందీప్‌కిషన్‌తో ఆమె నటించిన కోలీవుడ్ మూవీ మాయావన్ తెలుగులో ప్రొజెక్ట్ జడ్ పేరుతో రిలీజ్ కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాలేదు. మళ్లీ తెలుగులో ఛాన్సులు ఒడిసి పట్టాలని చూస్తోన్న లావణ్యకు ఆమె అందాల ఆరబోత ఎన్ని ఛాన్సులు తెస్తుందో ? చూడాలి.

