బాహుబలికి మెగాస్టార్ ఆశీస్సులు

'బాహుబలి 2' లో చిరంజీవి ఒక రోల్ లో కనిపిస్తాడని అనుకుంటున్నారా? లేదండి. అదేం లేదు మీరు చూస్తున్న ఫోటో చూస్తే చిరంజీవి 'బాహుబలి 'లో ఏమన్నా నటిస్తున్నాడా..! అనిపించక మానదు. అయితే 'బాహుబలి'లో చిరంజీవి యాక్ట్ చెయ్యడం లేదుగాని ప్రభాస్ కి ఆశీస్సులు మాత్రం అందచెయ్యడానికే చిరు అక్కడికి వెళ్ళాడట. ఈ సంఘటన అంతా రామోజీ ఫిలిం సిటీలో జరిగిన 'బాహుబలి 2' షూటింగ్ లో చోటుచేసుకుంది. చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' చిత్ర షూటింగ్ ... ప్రభాస్ 'బాహుబలి 2' చిత్ర షూటింగ్ ఒకే చోట జరగడం తో..... చిరు 'బాహుబలి 2' షూటింగ్ స్పాట్ కి విచ్చేసి ప్రభాస్ కి తన ఆశీర్వచనాలు ఇచ్చాడు.
బాహుబలి 2 షూటింగ్ లో రాజమౌళి కూడా వున్నాడు. ఇక 'మగధీర' సినిమా తర్వాత చిరుని రాజమౌళి కలిసిన సందర్భం లేదు. 'మగధీర' సినిమాలో చిరంజీవితో రాజమౌళి చేసాడు కాబట్టి వీరికి బాగానే పరిచయం ఉండడం తో కాసేపు ముచ్చట్లు వేసుకున్నారని 'బాహుబలి' చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఇదంతా రాజమౌళితో తనకి ఒక సినిమా ప్లాన్ ఉండడం తోనే చిరంజీవి రాజమౌళిని 'బాహుబలి' సెట్స్ లో కలిసాడని అంటున్నారు. మరి ఇది సాధ్యమవుతుందా? అనేది మాత్రం కాలమే చెప్పాలి. ఎందుకంటే ఒక్క 'బాహుబలి'కి రాజమౌళి దాదాపు 4 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. ఇక అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ 'మహాభారతాన్ని' ఎన్ని సంవత్సరాలు తెరకెక్కిస్తాడో అన్నది పెద్ద ప్రశ్న. .

